spot_img
Homeఎంటర్టైన్మెంట్Heroine Prema : హీరోయిన్ ప్రేమ ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉందో తెలుసా?

Heroine Prema : హీరోయిన్ ప్రేమ ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉందో తెలుసా?

Heroine Prema : ఓ వైపు ఆప్యాయత, అనురాగం.. మరో వైపు కట్టలు తెంచుకునే కోపం.. ఇంకో వైపు చేతులెత్తి మొక్కే దేవతకు ప్రతిరూపం.. ఇలా మల్టీఫుల్ యాక్టింగ్ నటి ప్రేమ సొంతం. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఇమడిపోయేతత్వం ప్రేమది. కన్నడం, తెలుగు, మలయాళం భాషలతో సంబంధం లేకుండా ఏ సినిమాల్లో నటించినా ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. పెళ్లి కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా ఆమె ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్ట్రాట్ చేవారు. కానీ మరోసారి సినిమాల్లో కనిపించడం లేదు. ఇంతకీ ప్రేమ ఏం చేస్తున్నారు? ఆమె ఎక్కడున్నారు? ఆసక్తికర స్టోరీ మీకోసం..

‘ప్రేమ’ పేరు చెప్పగానే ‘దేవి’ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో ఆమె నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఆమె పలు సినిమాల్లో దేవతగా కనిపించి ఆకట్టుకున్నారు. కానీ ప్రేమ అంతుకుముందే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1977 జనవరి 6న జన్మించిన ఆమె బెంగుళూర్ లో జన్మించారు. 1995లో ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ఓంకారం’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన ఈ మూవీ కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావడంతో రెండూ చోట్ల గుర్తింపు పొందారు. ఈ సినిమా తరువాత ఆమె తెలుగు ఇండస్ట్రీపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు. దీంతో రెండో సినిమానే విక్టరీ వెంకటేశ్ తో ‘ధర్మచక్రం’ లో నటించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది.

ఆ తరువాత కన్నడ, తెలుగు సినిమాలు చేస్తున్న ఆమెకు ‘దేవి’ సినిమాతో స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచును వివాహం చేసుకున్నారు. పదేళ్ల పాటు కలిసున్న వీరు 2016లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రేమ ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రేమ మరోసారి సినిమాల్లో నటించాలని అనుకుంది. దీంతో 2017లో ఉపేంద్ర తీసిన ‘మత్తేబా’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాట్ చేశారు. తెలుగులోనూ ఢీ, తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.

ఈమధ్య ప్రేమ రెండో పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని ప్రేమ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బెంగుళూరులో ఓ పెద్ద హౌస్ లో నివసిస్తున్న ప్రేమ.. మళ్లీ సినిమాల్లో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉంది. అయితే మంచి పాత్ర వస్తేనే చేస్తానంటోంది. ప్రస్తుతం తనకు సినిమాలు ముఖ్యం కాదని,అయితే మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటున్నానని చెబుతోంది. మరి ప్రేమ ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper
Exit mobile version