Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ పై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , జూన్ కి కి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆగస్టు 21 కి షిఫ్ట్ అయ్యింది. కానీ షూటింగ్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో, ఈ సినిమాని సెప్టెంబర్ 24 కి వాయిదా వేశారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు ఆడియన్స్ నుండి ఏ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క యూట్యూబ్ లోనే ఈ పాటకు 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాట ఈ మూవీ ఆల్బమ్ పై అంచనాలను భారీగా పెంచేశాయి , మరి మిగిలిన పాటలు ఆ అంచనాలను అందుకోగలవా అనే సందేహాలు అభిమానుల్లో ఉండేవి.
కానీ అక్కడ ఉన్నది అనిరుద్. ఒక దానిని మించి ఒకటి ఇవ్వడం అతని స్పెషాలిటీ. అందుకు నిదర్శనమే నేడు విడుదల చేసిన ‘ఏశ నాగుల’ సాంగ్. లిరికల్ వీడియో ఇంకా విడుదల చేయలేదు కానీ, నిన్న అమెరికా లో అనిరుద్ ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ లో , ఈ పాటని లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా విడుదల చేశారు. నేడు ‘స్పాటిఫై’ లోకి అందుబాటులోకి వచ్చేలా చేశారు. అసలే తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి ప్రస్తుతం క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. అలాంటి సమయంలో ఆ జానర్ నుండి ఈ రేంజ్ మాస్ బీట్ ఉన్న ఫోక్ సాంగ్ వస్తే ఇక థియేటర్స్ లో ఆడియన్స్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ‘ఆయా షేర్’ పాటలో నాని డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూశాము. ఇప్పుడు ‘ఏశ నాగుల’ సాంగ్ లో ఆయన హీరోయిన్ తో కలిసి ఏ రేంజ్ లో డ్యాన్స్ వేసి ఉంటాడో ఊహించుకోండి.
సరిగ్గా వినాయక చవితి దగ్గర్లో ఉన్నప్పుడు ఈ పాటని విడుదల చేశారు. ఇక గణపతి స్టాల్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పాట మోత మోగించనుంది. అయితే ఇది ఐటెం సాంగా?, లేదంటే మామూలు సాంగా? అనేది తెలియాల్సి ఉంది. ప్రముఖ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ ఐటెం సాంగ్ ఇదే అయితే మాత్రం, థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందనే చెప్పాలి. ఈ పాటని మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఏశ నాగుల కట్ట మీద ఏశిన ఉయ్యాల
మనం ఊగుదమె బాలా #Anirudh Live Performance #Nani డాన్స్ #YeshaNagula #TheParadise pic.twitter.com/m5Dk25bjCo— Rajesh Manne (@rajeshmanne1) August 29, 2026