spot_img
Homeఎంటర్టైన్మెంట్The Odyssey : 'ది ఒడిస్సీ' 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సంచలన రికార్డు..

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘ది ఒడిస్సీ’ బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. వీకెండ్ తర్వాత వసూళ్ళలో డ్రాప్స్ ఉండడం సహజమే. కానీ ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా చాలా డీసెంట్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 4 వ రోజు కంటే , 5 వ రోజు వచ్చిన వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. నాల్గవ రోజున ఈ చిత్రానికి 7 కోట్ల 76 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 5 వ రోజున 8 కోట్ల 5 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 72 కోట్ల 62 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతిష్టాత్మక వంద కోట్ల నెట్ ని దాటనుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రానికి సంబంధించిన 5 వ రోజు వసూళ్లు పుంజుకున్నాయి. ఎందుకంటే మంగళవారం రోజున టికెట్ రేట్స్ పై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. 5 వ రోజున ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి అక్షరాలా 21 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 162 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు.

ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 350 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 3 వేల కోట్ల రూపాయలకు పైమాటే. ఇదే ఊపులో ముందుకు పోతే , ఈ చిత్రం కచ్చితంగా లాంగ్ రన్ లో హాలీవుడ్ ప్రతిష్టాత్మక 1 బిలియన్ మార్కు క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజెన్స్. అయితే ఈ నెల 31 న స్పై డర్ మ్యాన్ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ ప్రభావం ‘ది ఒడిస్సీ’ పై పడుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...
Oktelugu Epaper