Homeఎంటర్టైన్మెంట్Mega Heroes: మార్చి నుంచి మెగా హీరోల హవా స్టార్ట్ అవ్వబోతోందా..?

Mega Heroes: మార్చి నుంచి మెగా హీరోల హవా స్టార్ట్ అవ్వబోతోందా..?

Mega Heroes: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 వ సంవత్సరంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. […]

Mega Heroes: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 వ సంవత్సరంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. అందులో ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువగా హరిహర వీరమల్లు డిజాస్టర్ అయింది… మొత్తానికైతే ఈ సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.

ఇక మరోసారి 2026 వ సంవత్సరంలో దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చిరంజీవి నమ్ముతున్నాడు…

ఇక మార్చి 26వ తేదీన ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాని సైతం ఈ నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా 2026 వ సంవత్సరం మొత్తం మెగా ఫ్యామిలీ సినిమాలు భారీ రేంజ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

అందులో ఏ సినిమా ఇలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక సాయిధరమ్ తేజ్ చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా సైతం 2026 లోనే రిలీజ్ కి ముస్తాబవుతుండడం విశేషం… 2026 వ సంవత్సరం మెగా హీరోలకు కలిసొస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper