Akhanda 2 Background Music: బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే, ఆ సినిమాలోని మాస్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం ఊహించుకోవడం కూడా కష్టమే అన్నట్టుగా ఉంటాయి. రీసెంట్ గా విడుదలైన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం లోని మాస్ సన్నివేశాలు కూడా ఈ రేంజ్ లోనే ఉన్నాయి. అసలు ఒక ఫైట్ సన్నివేశాన్ని ఇలా కూడా తీయొచ్చా?, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండీ బాబు అంటూ బోయపాటి శ్రీను పై ఆడియన్స్ విడుదలైన రోజు నుండి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య, బోయపాటి లకు తమన్ తోడు అయితే మాస్ విద్వంసమే. ‘అఖండ’ చిత్రం తర్వాత బాలయ్య చేస్తున్న ప్రతీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. బాలయ్య వెండితెర మీద కనిపించిన ప్రతీసారి తమన్ పూనకాలు వచినవాడిలాగా ఊగిపోయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తూ ఉంటాడు.
‘అఖండ’ సినిమా విడుదల సమయం లో ఓవర్సీస్ లోని కొన్ని థియేటర్స్ లో తమన్ మ్యూజిక్ ని తట్టుకోలేక, DTS బాక్సులు తగcలబడిపోయిన ఘటనలను అంత తేలికగా మర్చిపోగలమా?, ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా అలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇప్పుడు ‘అఖండ 2’ విషయం లో అలాంటి ఘటనలు రెండు చోట్ల జరిగాయని తెలుస్తోంది. నిన్న రాత్రి తణుకు లోని అంబికా థియేటర్ లో స్క్రీన్ పై మంటలు చెలరేగి కాలిపోయిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదే విధంగా రాయలసీమ ప్రాంతం లోని ఆదోని లో ఒక థియేటర్ లో ఇలాగే మ్యూజిక్ ని తట్టుకోలేక స్పీకర్లు పగిలిపోవడం తో కాసేపు షో ని ఆపేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం తో, నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. తమన్ మ్యూజిక్ లో ‘బాస్’ ని ఎక్కువగా ఉపయోగించడం వల్లే ఇలా అవుతుందని, థియేటర్ లో కూర్చొని చూసే ఆడియన్స్ కి కూడా కాస్త ఆయన మ్యూజిక్ తలనొప్పి కలిగించేలా ఉందని అంటున్నారు నెటిజెన్స్.
బోయపాటి శ్రీను గత చిత్రం ‘స్కంద’ కి కూడా తమన్ సంగీత దర్శకత్వం చేసాడు. ఈ సినిమా కూడా ప్రదర్శించిన కొన్ని థియేటర్స్ లో స్పీకర్స్ కాలిపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఈ విషయాన్నీ బోయపాటి శ్రీను దృష్టిలోకి తీసుకెళ్తే, నా సినిమాలో సన్నివేశాలు చాలా హై గా ఉంటాయి, ఆ హై కి తగ్గ మ్యూజిక్ ని నేను కొట్టించుకుంటాను, కాబట్టి థియేటర్స్ యాజమాన్యాలు వాటిని తట్టుకొని నిలబడగలిగే స్పీకర్స్ ని అమర్చుకోవాలి, లేదంటే ఇలాంటి సంఘటనలే రిపీట్ అవుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను.