Site icon OkTelugu

Ram Charan Vs Allu Arjun: రామ్ చరణ్ కు చెక్ పెడుతున్న అల్లు అర్జున్…ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా..?

Allu Arjun Negative Role

Allu Arjun Negative Role

Ram Charan Vs Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ సైతం తండ్రి తగ్గ తనయుడిగా ఎదిగాడు. ‘రంగస్థలం’ సినిమాతో తన టాలెంట్ ను బయట పెట్టిన రామ్ చరణ్ ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో ‘గ్లోబల్ స్టార్ ‘ గా అవతరించాడు. గత సంవత్సరం ఆయన చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనే విషయంలోనే సరైన క్లారిటీ రావడం లేదు.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

‘పుష్ప 2’ సినిమా తో పాన్ ఇండియాలో పలు రికార్డ్ లను క్రియేట్ చేసిన అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారిపోయాడు. ‘పుష్ప 2’ మూవీతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా సక్సెస్ ల విషయంలో రామ్ చరణ్ కి చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ కు మించిన మార్కెట్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ మరో సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకొని రామ్ చరణ్ కంటే తను టాప్ రేంజ్ లోకి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందని చాలామంది సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు…

మరి దీని వెనకాల అల్లు అర్జున్ చాలా వరకు బ్యాక్ ఎండ్ వర్క్ నడిపిస్తున్నారట. అల్లు అర్జున్ టాప్ హీరో అయ్యాడు అంటూ తన పీఆర్ఓ లతో ప్రమోషన్స్ కూడా చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా రామ్ చరణ్ కు చెక్ పెట్టడానికి అల్లు అర్జున్ టీమ్ చాలా కష్టపడుతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు గాని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలైతే వైరల్ అవుతున్నాయి…నిజానికి మెగాస్టార్ చిరంజీవి వల్లే అల్లు అర్జున్ హీరో అయ్యాడు…మొన్నటి వరకు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నప్పటికి ఆ తర్వాత ఆయన అల్లు ఫ్యామిలీ అంటూ తనకు సెపరేట్ ట్యాగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు…

Exit mobile version