Site icon OkTelugu

Ram Charan Reaction To Vishwambhara Movie: ‘విశ్వంభర’ సినిమా చూసిన రామ్ చరణ్… ఆయన రియాక్షన్ ఏంటంటే..?

Ram Charan Reaction To Vishwambhara Movie

Ram Charan Reaction To Vishwambhara Movie

Ram Charan Reaction To Vishwambhara Movie: కొన్ని పేర్లు విన్నప్పుడు బాడీలో ఏదో తెలియని వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులందరిలో ఒక జోష్ నింపుతున్న ఒకే ఒక పేరు చిరంజీవి… కారణం ఏంటి అంటే సామాన్యుడు కూడా గొప్ప కలలను కనవచ్చు వాటిని సాకారం చేసుకోవచ్చు అని ప్రూవ్ చేసిన హీరో చిరంజీవి… నిజానికి సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు… ఇండస్ట్రీలో ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటే చిన్న పాత్రలు వేసే అవకాశాలు వస్తాయి. కానీ ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు మాత్రం చాలా సంవత్సరాల పాటు అవకాశం కోసం ఎదురు చూడాల్సిన అవసరమైతే ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగొందుతారు.ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సినిమా మీద ఉన్న పిచ్చి తో ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులను ఎదుర్కొని తిని తినక పస్తులుండి మరి పోరాటం చేశాడు. ఒకరకంగా ఆయన ఇండస్ట్రీకి రావడం అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. సినిమా ఇండస్ట్రీ అనే కాదు ప్రతి రంగంలో చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగేవాళ్లు కొన్ని కోట్లలో ఉన్నారు.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

అలాంటి చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తన మార్కు ను చూపిస్తూ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని విజయాలను సాధించాడు… ఇక రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి అక్కడ పెద్దగా సక్సెస్ అయితే రాలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఆశించిన మేరకు విజయాలైతే రావడం లేదు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

అయిన కూడా అది చిరంజీవి రేంజ్ సినిమా కాదని ఒక వర్గం ప్రేక్షకులైతే వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో చేసిన ‘విశ్వంభర’ సినిమా ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్ చెప్పడం లేదు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ సైతం ఈ సినిమాని చూశారట… ఈ సినిమా రామ్ చరణ్ కి నచ్చిందనే వార్తలైతే వస్తున్నాయి.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాకి హైలైట్ అవుతుందని ఫస్టాఫ్ లో మరికొన్ని చేంజెస్ చేయాలని రామ్ చరణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరికి వారు ఈ సినిమా పట్ల వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్న ప్రతిసారి సినిమాని మారుస్తూ వస్తున్నారు. దానివల్ల సినిమా సోల్ చెడిపోతుందని దర్శకుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో ఈ సినిమా ఆడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version