Site icon OkTelugu

Delhi Liquor Scam Kavitha Clean Chit: లిక్కర్‌ స్కాం లో కవితకు క్లీన్‌ చీట్‌.. కెసిఆర్‌ దగ్గరికి తీస్తారా?

Delhi Liquor Scam Case Kavitha

Delhi Liquor Scam Case Kavitha

Delhi Liquor Scam Kavitha Clean Chit: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఢిల్లీ మాజీ సీఎం, మాజీ మంత్రితోపాటు పలువురు మద్యం వ్యాపారులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ విచారణలో తెలుగు రాష్ట్రాల లింకులు బయటపడ్డాయి. ఏపీకి చెందిన ఎంపీ, ఆయన కొడుకు, లిక్కర్‌ వ్యాపారులు అరెస్ట్‌ అయ్యారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే తాజాగా ఈ కేసు నుంచి కవిత పేరును సీబీఐ కోర్టు తొలగించింది. దీంతో క్లీన్‌ చిట్‌ లభించినట్లయింది. ఈ కేసు కారణంగా కవితను కేసీఆర్‌ రాజకీయాలకు దూరం పెట్టారు. దీంతో పార్టీలో అంతర్గత గొడవలు మొదలై చివరకు కవిత పార్టీ నుంచి బయటకు వచ్చారు. సొంత పార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కవితకు క్లీన్‌ చిట్‌ రావడం గమనార్హం.

Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

కవితకు ఊరట..
ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో అక్రమాలతో సంబందించి కవిత 166 రోజులు తిహార్‌ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు చార్జిషీట్‌ వేసిన తర్వాత బెయిల్‌ వచ్చింది. అయితే ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమె పేరును డిస్ఛార్జ్‌ చేసింది, పూర్తి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి కూడా ఈ తీర్పు ప్రయోజనం చేకూరింది.

కేసు నేపథ్యం..
ఈ స్కామ్‌ ఢిల్లీలో లిక్కర్‌ లైసెన్సులు, కాంట్రాక్టుల్లో ముడిపడి ఉంది. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి కోట్లాది రూపాయల మోసం చేశారని సీబీఐ ఆరోపించింది. కవిత పాలుపంచుకున్నట్లు పేర్కొంది. సాక్ష్యాలు సరిపోకపోవడంతో కోర్టు ఆమె పేరు తొలగించింది. ఇది రాజకీయ ఎదురుచూపులతో ముడిపడిన కేసుగా మారింది.

కేసీఆర్‌ కుటుంబంలో గొడవ..
లిక్కర్‌ కేసులో కవిత అరెస్టు కారణంగా కేసీఆర్‌ కుటుంబంలో గొడవ మొదలైంది. కవిత ఇమేజ్‌ భారీగా డ్యామేజ్‌ అయింది. దీంతో కవితను పార్టీకి దూరంగా ఉంచాలని 2023 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ భావించింది. అలాగే చేసింది కూడా. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. దీంతో పార్టీలో ఆధిపత్య గొడవ మొదలైంది. కేటీఆర్, కవిత, హరీశ్‌రావు మధ్య ముసలం పుట్టింది. చివరకు కవితను పార్టీ నుంచి సస్పెండ చేశారు కేసీఆర్‌..

ఇప్పుడు దగ్గకు తీస్తారా?
తాజా క్లీన్‌ చిట్‌ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌ కుటుంబంలో కవిత ఎప్పటి నుంచో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు క్లీన్‌ చిట్‌ ఆమెను మరింత బలోపేతం చేస్తుంది. అయితే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కవిత కేసీఆర్‌ పిలిస్తే వెళ్తారా లేదా అన్నది చూడాలి.

Exit mobile version