Ram Pothineni : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ లో గడ్డుపరిస్థితి ని ఎదురుకుంటున్న హీరోలలో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). ఇతని కెరీర్ ప్రారంభం లో కొట్టిన సూపర్ హిట్స్ ని చూసి భవిష్యత్తులో ఇతను పెద్ద స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ కెరీర్ ప్రారంభం లో ఈయన మార్కెట్ ఎంత పరిధి లో ఉండేదో, ఇప్పటికే అంతే పరిధికి పరిమితమైంది. అందుకు కారణం ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్. ఒక సూపర్ హిట్ కొడితే,వరుసగా నాలుగైదు డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్నాడు. ఇప్పటికే అదే ట్రెండ్ లో ఆయన కెరీర్ కొనసాగుతుంది. అందుకే ఇక నుండి మినిమమ్ గ్యారంటీ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగా ఆయన ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Movie) అనే సినిమాని ఒప్పుకున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేయగా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో రామ్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కి వీరాభిమాని గా నటిస్తున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ‘నువ్వెంటే చాలే’ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది మూవీ టీం. వివేక్ & మెర్విన్ స్వరపర్చిన ఈ పాటకు అనిరుద్ రవించందర్ గాత్రం అందించాడు. ట్యూన్ రొటీన్ గా కాకుండా చాలా ఫ్రెష్ ఫీల్స్ తో ఉంది. ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ లో రాబోయే రోజుల్లో మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలం లో ఒక సినిమాకు హైప్ రావాలంటే సాంగ్స్ పెద్ద హిట్ అవ్వాలి. ఆ విధంగా చూసుకుంటే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి మొదటి బాల్ సిక్సర్ అయ్యింది అని చెప్పొచ్చు. టీజర్ లేదా గ్లింప్స్ వీడియో ఆకట్టుకునే విధంగా ఉంటే రామ్ కి దాదాపుగా హిట్ పడినట్టే.
ఈ చిత్రానికి పీ. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గతం లో మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. మినిమం గ్యారంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి, ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే అనుకుంటున్నారు రామ్ ఫ్యాన్స్. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే నేడు విడుదల చేసిన పాట పై కొన్ని ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే రామ్ ఈ చిత్రం హీరోయిన్ భాగ్యశ్రీ తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉంటున్నాడు అనే వార్త వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు విడుదల చేసిన పాట ఆమె కోసమే అన్నట్టుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ పాట ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.