Andhra King Taluka Teaser Review: రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ భోర్సే(Bhagya కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం వచ్చే నెలాఖరున విడుదల అవ్వబోతున్న సందర్భంగా నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే ‘నువ్వెంటే చాలే’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమా పై యూత్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మ్యాచ్ చేసే విధంగా నేడు విడుదలైన టీజర్ ఉంది. సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి ని రేపేలా చేసింది. ఈ టీజర్ స్టార్ హీరోలను పిచ్చిగా అభిమానించే ప్రతీ ఒక్కరి మనసులను గుచ్చినట్టుగా అనిపించడం గమనార్హం. ఇందులో రామ్ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కి వీరాభిమాని గా నటిస్తున్నాడు. తన అభిమాన నటుడిని కలుసుకునేందుకు హీరో పడిన పాట్లను వివరించే విధంగా ఈ సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందట.
‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక టీజర్ విషయానికి వస్తే ఒక సూపర్ స్టార్ కి వీరాభిమాని అయిన హీరో, ఆ హీరో కి ఒక అందమైన ప్రేమకథ, సూపర్ స్టార్ మీద పిచ్చి తో చేసిన కొన్ని పనుల కారణంగా హీరో జీవితం లో ఎదురుకున్న విషాద సంఘటనలు, ఇలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపించింది ఈ టీజర్. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చే ‘ఫ్యాన్..ఫ్యాన్ ని నువ్వు గుడ్డలు చింపేసుకోవడమే కానీ, నువ్వు ఒకడివి ఉన్నావు అనే విషయం కూడా వాళ్లకు తెలియదు. ఏమి బ్రతుకులు రా మీవి’ అని వచ్చే డైలాగ్ ప్రతీ హీరో అభిమాని మనసుని గుచ్చుకునేలా చేసింది. నిజమే కదా, హీరోల మీద అంత అభిమానం పెంచుకోవడం అవసరమా అని ఒక్క క్షణం అయినా మనకు ఈ టీజర్ చూస్తే అనిపిస్తుంది.
ఈ టీజర్ ని చూస్తే మనకి వెంటనే రవితేజ నేనింతే సినిమా కూడా గుర్తుకు వస్తుంది. అందులో కూడా ఒక అభిమాని, తన అభిమాన హీరో కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడడం, తన హీరో పై ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళతో గొడవ పడడం, తన హీరో సినిమాకు రికార్డు కోసం ఇంట్లో తన చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులను కూడా తీసుకోవడం, ఆ తర్వాత కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాక ఆత్మహత్య చేసుకోవడం వంటివి చూపిస్తారు. నేడు విడుదలైన ఈ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ లో ఆ రేంజ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా ఉంటుందో లేదో తెలియదు కానీ, నేనింత షేడ్స్ మాత్రం స్పష్టంగా కనిపించింది. చూడాలి మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది. టీజర్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రం రామ్ రీసెంట్ సినిమాల్లో ది బెస్ట్ గా నిలుస్తుందని అనిపిస్తుంది.