Coolie storyline: సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్, సూపర్ స్టార్ తో చేతులు కలపబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడే అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఎప్పుడైతే ఈ చిత్రం లోకి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర(Upendra), అమీర్ ఖాన్(Aamir Khan) వంటి సూపర్ స్టార్స్ కూడా వచ్చారో, అప్పటి నుండి అంచనాలు ఇంకా పదింతలు ఎక్కువ అయ్యాయి. ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియన్ చిత్రం గా బిజినెస్ పరంగా సెన్సేషన్ సృష్టించింది. తమిళనాడు లో రజనీకాంత్ తప్ప మరొకరు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోవడం కష్టమే. ఆ రేంజ్ లో జరిగింది. తెలుగు వెర్షన్ కూడా 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.
Also Read: నోరు జారిన నాగార్జున..ఏకిపారేస్తున్న రజనీకాంత్ ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమా మొదటి కాపీ ని సూపర్ స్టార్ రజనీకాంత్ కి స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా వేసి చూపించారట మేకర్స్. ఈ సినిమాని చూసిన వెంటనే ఆయన చాలా ఎమోషన్ కి గురయ్యాడట. వెంటనే లోకేష్ కనకరాజ్ ని హత్తుకొని, ధన్యవాదాలు చెప్తూ ‘నాకు దళపతి చిత్రాన్ని గుర్తు చేశావు’ అని అన్నాడట. అంటే ఈ కూలీ చిత్రం ‘దళపతి’ లైన్ మీద తెరకెక్కిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. దళపతి చిత్రం ఇద్దరి స్నేహితులకు సంబంధించిన కథ. ఈ సినిమా కూడా స్నేహితులకు సంబంధించిన కథ యేనా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా స్టోరీ మీద ఇప్పటి వరకు మేకర్స్ ఆడియన్స్ కి అర్థం అయ్యే విధంగా ఒక్క కంటెంట్ కూడా వదల్లేదు. కేవలం పోర్ట్ నేపథ్యం లో సాగే కథ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.
Also Read: సోషల్ మీడియా లో పిచ్చ నా కొడుకులు ఎక్కువగా ఉన్నారు – నిర్మాత నాగవంశీ
ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున చెప్పాడు, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో లోకేష్ కనకరాజ్ కూడా చెప్పాడు. ఆయన్ని ఈ క్యారక్టర్ ఒప్పించేందుకు లోకేష్ చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఇకపోతే రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన మౌనిక అనే పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పూజ హెగ్డే మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ చూసి అందరూ మెంటలెక్కిపోయారు. ఇది కదా సినిమాకు కావాల్సిన ఊపు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక థియేట్రికల్ ట్రైలర్ అప్డేట్ విషయానికి వస్తే , వచ్చే వారం లో కచ్చితంగా ట్రైలర్ విడుదల ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.