Akhil Agent: భారీ హైప్ తో అక్కినేని నాగార్జున గారి రెండవ వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ కి ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా సరైన హిట్టు లేదు..మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్..రెండవ సినిమా యావరేజ్..మూడవ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్..నాల్గవ సినిమా జస్ట్ హిట్..ఇలా భారీ హైప్ తో వచ్చిన అక్కినేని అఖిల్ కి మూడు రీ ఎంట్రీల తర్వాత చివరికి ఒక మాములు హిట్ అయితే వచ్చింది కానీ హీరో గా నిలదొక్కుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకునే రేంజ్ హిట్ అయితే ఇప్పటి వరుకు రాలేదు..ఇప్పుడు అక్కినేని ఫాన్స్ మొత్తం అఖిల్ తదుపరి చిత్రం ‘ఏజెంట్’ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు..క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాకి ఒక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు..ఇటీవలే విడుదలైన టీజర్ కి కూడా మెంటల్ మాస్ రెస్పాన్స్ వచ్చింది..అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త అక్కినేని ఫాన్స్ లో నూతనోత్సాహం నెలకొంది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది విడుదలైన రామ్ చరణ్ #RRR చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను డైరెక్టర్ రాజమౌళి ఎంత అడవుతంగా తెరకేకించాడో మన అందరికి తెలిసిందే..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే కాదు..ప్రపంచం లో ఎవ్వరు కూడా ఈ రేంజ్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను తెరకెక్కమ్చలేదు ఏ డైరెక్టర్ కూడా..ఇప్పుడు సురేందర్ రెడ్డి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు..ఏజెంట్ సినిమాలో అఖిల్ ఇంట్రడక్షన్ సన్నివేశం #RRR ని తలదన్నే విధంగా ఉంటుందట..ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో శెరవేగంగా జరుగుతుంది..సుమారు వెయ్యి మందికి పైగా ఆర్టిస్టులతో భారీ బడ్జెట్ తో ఈ సన్నివేశం ని తీస్తున్నారట..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే చిరస్థాయిగా నిలిచిపొయ్యే రేంజ్ ఇంట్రడక్షన్ సీన్ గా అది నిలిచిపోతుంది..మరి ఇంత లాగ హైప్ ని పెంచుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరుకు ఆగాల్సిందే..ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముటి ఒక పాత్రలో కనిపిస్తున్నారు.