Mokshagna Debut Movie Update: గత కొన్ని సంవత్సరాల నుంచి బాలయ్య బాబు కొడుకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య బాబు సైతం ప్రతి సంవత్సరం తన కొడుకు ఇండస్ట్రీకి రాబోతున్నాడు అంటూ అనౌన్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పటివరకుఒక్షగ్న హీరోగా సినిమా స్టార్ట్ అవ్వలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుంది వస్తుంది అంటు అనౌన్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం తనను ఇండస్ట్రీకి తీసుకొచ్చే బాధ్యతను బాలయ్య మరో యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ‘వివేక్ ఆత్రేయ’ ‘బాలయ్య బాబు’ ని కలిసి తనతో సినిమా చేయడానికి కథనైతే వినిపించాడు. కథ బాలయ్యకి బాగా నచ్చింది. దాంతో మన కాంబో లో సినిమా చేద్దాం కానీ ముందు నా కొడుకుతో సినిమా చేయమని వివేక్ ఆత్రేయ కి బాలయ్య చెప్పాడట…
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
ఇక వివేక్ ఆత్రేయ సైతం దానికి ఓకే చెప్పాడనే వార్తలైతే వస్తున్నాయి. తొందరలోనే వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అంటూ అనౌన్స్మెంట్ రాబోతుందట. మొత్తానికైతే మోక్షజ్ఞ ఈ సంవత్సరం మేకప్ వేసుకోబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ సినిమా 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేస్తారా? లేదంటే ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి… ఎట్టకేలకు నందమూరి అభిమానుల నిరీక్షణ ఫలించిందనే చెప్పాలి.
మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ వారసుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త ప్రతి ఒక్కరిని ఆనందింపజేస్తుంది. తన నటన ఏ విధంగా ఉంటుంది మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా మారే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…