Naga Chaitanya – Samantha: సమంత మరియు నాగ చైతన్య లు విడిపోయి దాదాపుగా ఏడాది దాటింది..ఈ ఏడాది సమయం లో వీళ్లిద్దరి మధ్య వచ్చినన్ని వార్తలు ఏ హీరో మీద కానీ..ఏ రాజకీయ నాయకుడి మీద కానీ రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అయితే వీళ్లిద్దరి గురించి రీసెంట్ గా మరో వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది..అదేమిటి అంటే వీళ్లిద్దరు త్వరలోనే ఏ మాయ చేసావే సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారట..గౌతమ్ మీనన్ ఇటీవలే నాగ చైతన్య ని కలిసి స్టోరీ వినిపించగా ఆయన చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది..నాగ చైతన్య కి సమంత తో కలిసి నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ సమంత మాత్రం సిద్ధం గా ఉందొ లేదో అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..ఇటీవలే ఆమె బాలీవుడ్ లో పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రోగ్రాం చూస్తే నాగ చైతన్య మీద ఆమెకి ఎంత కోపం ఉంది అనేది అర్థం అయ్యిపోతాది..కానీ సమంత ని ఒప్పించే బాధ్యత నాది అని గౌతమ్ మీనన్ బలంగా నిర్ణయం తీసుకున్నాడట..మరి వీళ్ళిద్దరిని కలిపి ఆయన సినిమా తియ్యగలడా లేదా అనేది చూడాలి.

2010 వ సంవత్సరం లో నాగచైతన్య రెండవ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ద్వారా సమంత ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది..మహేష్ బాబు అక్క మంజుల ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది..కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ గా నిలవడమే కాకుండా..టాలీవుడ్ ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది..అంతే కాకుండా సమంత ఈ సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఆ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మన అందరం కళ్లారా చూసాము..అలాంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాకి సీక్వెల్ అంటే ఎలాంటి హైప్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దానికి తోడు విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య మరియు సమంత కలిసి నటిస్తున్నారు అంటే మార్కెట్ లో హైప్ పదింతలు ఎక్కువ అవుతుంది..పైగా గౌతమ్ మీనన్ ఇప్పుడు లేటెస్ట్ గా తమిళం లో శింబు తో ఒక భారీ హిట్ కొట్టి మంచి ఫామ్ మీద ఉన్నాడు..ఏ మాయ చేసావే సీక్వెల్ బాగా తీసాడంటే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు ఆకాశమే హద్దులాగా ఉంటుంది..చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో.