Sita Ramam: జనాలు OTT కి బాగా అలవాటు పడిపోయారు..థియేటర్స్ కి రావడం మానేశారు అని మన ఇండస్ట్రీ పెద్దలు వాపోతున్న సమయం లో మంచి సినిమా వస్తే ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు..నాల్గవ వారం లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ఇస్తారు అని నిరూపించేలా చేసిన సినిమా ‘సీతారామం’..ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం కూడా లేదు..కానీ కంటెంట్ అద్భుతంగా ఉండేలోపు ఏకంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని ఇచ్చారంటే మన తెలుగు ఆడియన్స్ ఎంత గొప్పవాళ్ళో అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహం వల్ల ఇతర భాషలకు చెందిన బడా బడా సూపర్ స్టార్స్ కూడా టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా చెయ్యాలనే కుతూహలంతో ఉన్నారు..ఇక ఇటీవలే ఈ సినిమాని హిందీ లో విడుదల చెయ్యగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇటీవలే మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో గా పిలవబడే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని కూడా చాలా ప్రాంతాలలో దాటేసింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని విజయనగరం జిల్లాలో సీతారామం సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి..ఇక్కడ ఈ సినిమా క్లోసింగ్ లో దాదాపుగా 95 లక్షలకు పైగానే గ్రాస్ వసూళ్లను సాధించింది..ఇక్కడ 2018 వ సంవత్సరం దసరా కానుకగా విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సామెత వీరరాఘవ’ సినిమా వసూళ్లను దాటి వేసింది..అరవింద సామెత చిత్రం ఇక్కడ అప్పట్లో బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని, అత్యధిక టికెట్ రేట్స్ తో 94 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ కలెక్షన్స్ ని ఇప్పుడు సీతరామం చిత్రం అలవోకగా క్రాస్ చేసేసింది అంటే మాములు విషయం కాదు..మన తెలుగు ఆడియన్స్ ఒక సినిమాని మనస్ఫూర్తిగా ఆదరిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికే నిదర్శనం ఈ చిత్రం..OTT లో వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా ఇంకా చాలా ప్రాంతాలలో మంచి వసూళ్లతో రన్ అవుతూనే ఉంది..పరిస్థితి చూస్తూ ఉంటె ఈ సినిమాకి కేవలం నైజం ప్రాంతం నుండే 50 రోజుల కేంద్రాలు కనీసం 45 ఉండేట్టు ఉన్నాయి..మన తెలుగు లో ఒక సినిమా ఈ రేంజ్ లో 50 రోజులు మరియు వంద రోజులు ఆడడం చూసి ఎన్ని రోజులు అయ్యిందో అని ట్రేడ్ పండితులు మురిసిపోతున్నారు.