IND vs NZ final : 2007 లో టి20 వరల్డ్ కప్ టోర్నీని ఐసీసీ నిర్వహించింది. నాటి టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత మరోసారి t20 వరల్డ్ కప్ అందుకోవడానికి టీమిండియాకు 17 సంవత్సరాలు పట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ అందుకున్న టీమిండియా.. కొన్ని సందర్భాలలో కప్ కు దగ్గరగా వెళ్ళినప్పటికీ.. అందుకోలేకపోయింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది.
2024లో టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత 2026 టోర్నీలోకి టీమిండియా డిపెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టింది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మీద మినహా.. మిగతా జట్ల మీద అంత గొప్పగా ఆడలేదు. దీనికి తోడు సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో టీమిండియా మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. సౌత్ ఆఫ్రికా మీద ఎదురైన ఓటమి టీమిండియాలో చాలా మార్పులను తీసుకొచ్చింది. ఆటగాళ్లు సమిష్టి తత్వాన్ని ప్రదర్శించారు. ఫలితంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మీద గెలిచి టీమిండియా ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచ కప్ ను అందుకుంది.
ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ చేసింది. ముందుగా బౌలింగ్ చేయడం న్యూజిలాండ్ జట్టుకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. వాస్తవానికి పిచ్ మొత్తాన్ని నెల రేగడితో రూపొందించిన నేపథ్యంలో.. డ్యూ ఉంటుందని న్యూజిలాండ్ కెప్టెన్ భావించాడు. కానీ అతడు అనుకున్నది వేరు.. మైదానంలో జరిగింది వేరు . టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వన్ డౌన్ ఆటగాడు హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో టీం ఇండియా స్కోర్ 255 పరుగులు చేసింది. సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై 253 రన్స్ చేస్తే.. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద టీమిండియా 255 పరుగులు చేసింది.
256 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఏ దశలో కూడా విజయం వైపు ప్రయాణం సాగించలేదు. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ సి ఫర్డ్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నప్పటికీ.. అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సపోర్ట్ లభించలేదు. దీనికి తోడు టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మినహా మిగతా వారంతా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో న్యూజిలాండ్ జట్టు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయింది. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు . అక్షర్ పటేల్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఫలితంగా టీమిండియా ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ట్రోఫీ ద్వారా టి20 వరల్డ్ కప్ లు మూడుసార్లు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి.