SS Rajamouli Allu Arjun Movie: ఎవరి పేరు చెబితే రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయో, ఎవరి బ్రాండ్ మార్క్ పడితే బాక్సాఫీస్ కలెక్షన్లతో బద్దలైపోతుందో అతడే దర్శక ధీరుడు రాజమౌళి…ఆయన ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది…ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాతో ఎలాగైనా సరే పాన్ ఇండియాలో ఉన్న రికార్డు లను బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి దర్శకుడి తో పని చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు పోటీ పడుతున్నారు. ఆయన ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేశాడు…ఒక్క ఇద్దరితో తప్ప వాళ్లు ఎవరు అంటే ఒకరు పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు అల్లు అర్జున్ కావడం విశేషం…
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
పవన్ కళ్యాణ్ విషయం కాసేపు పక్కన పెడితే అల్లు అర్జున్ తో ఆయన పలు సందర్భాల్లో సినిమాను చేసే అవకాశం వచ్చినప్పటికి ఒక ఇద్దరు దర్శకుల వల్ల అది వర్కౌట్ కాలేదట… నిజానికి ‘మగధీర’ తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు…కానీ అప్పుడు సుకుమార్ ‘ఆర్య 2’ సినిమా చేస్తూ అల్లు అర్జున్ ను లాక్ చేశాడు…
ఇక ‘ఈగ’ తర్వాత ‘బాహుబలి’ సినిమా కి ముందు కూడా రాజమౌళి అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా రావాల్సింది. కానీ అదే సమయం లో త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ తో జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశారు…
ఇక సుకుమార్ – త్రివిక్రమ్ వల్లే రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయలేదు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ చేస్తున్నారు…ఇక ఫ్యూచర్ లో వీళ్ళ కాంబోలో ఒక సినిమా వస్తే చూడాలని అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…