Ritu Varma: అచ్చ తెలుగు భామ ‘రీతూ వర్మ’ గత సినిమా ‘టక్ జగదీశ్’ చేసింది. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. దాంతో ఈ భామకు ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రావడం లేదు. మలయాళంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఎలాగైనా తెలుగులో హీరోయిన్ గా నిలబడటానికి ఎప్పటి నుంచో నానా కష్టాలు పడుతుంది. అయినా పెద్దగా ఛాన్స్ లు మాత్రం రాలేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే.. నాని అమ్మడుకి తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశం రీతూకి ఉపయోగపడేలా లేదు.

ఇక అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ కి రెడీ అవ్వడానికి రీతూ వర్మ సన్నద్ధం అవుతుంది. కొత్త ఫోటో షూట్ లను ప్లాన్ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన పిక్స్ వైరల్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి బోల్డ్ లుక్ లో కనిపించినంత మాత్రానా తెలుగు సినిమా పరిశ్రమ రీతూ వర్మను పట్టించుకుంటుందా ? అంటే డౌటే. నిజానికి రీతూ వర్మ హీరోయిన్ మెటీరియల్ కాదు.
ఆమెలో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ తక్కువ. అందుకే, ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. భవిష్యత్తులో వస్తాయని నమ్మకం కూడా లేదు. కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీతూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే, ఆమెకు అదృష్టం కలిసి వచ్చి.. మలయాళంలో హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చాయి. ఆ ఛాన్స్ లను సక్సెస్ ఫుల్ గా వాడుకోవడంతో అక్కడ హీరోయిన్ గా కూడా సక్సెస్ అయింది.

ఎంత సక్సెస్ అయినా మొదటి నుంచి టాలీవుడ్ కి ఎందుకో ఈ బ్యూటీ బాగా చులకన అయిపోయింది. రీతూ వర్మను ఒక హీరోయిన్ గా గుర్తించడానికి తెలుగు దర్శక నిర్మాతలు ఇంకా ఆసక్తి చూపించడం లేదు. మొత్తమ్మీద పెద్ద అవకాశాలు ఎలాగూ ఇవ్వరు, కనీసం మీడియం రేంజ్ సినిమాల్లో కూడా ఈ భామకి ఛాన్స్ లు ఇవ్వకపోతే ఎలా ? అందుకే, కన్నడంలో తన లక్ ని పరీక్షించుకోవడానికి రీతూ ప్రయత్నాలు మొదలెట్టింది.
తాజాగా ఈ బ్యూటీ తన కన్నడ సినిమా అవకాశాల కోసం అక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. కనీసం కన్నడంలోనైనా కెరీర్ ని బిల్డ్ చేసుకుందామని రీతూ వర్మ తెగ ఉబలాట పడుతోంది. మొత్తానికి అవకాశాల కోసం కన్నడంలోకి వెళ్ళింది. ఐతే అనూహ్యంగా అక్కడ ఛాన్స్ లు వస్తున్నాయి. అందుకే అక్కడే బెటర్ అంటుంది.