Tejaswini Gowda : తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేర్లు అమర్ దీప్(Amardeep Chowdary), తేజస్విని గౌడ(Tejaswini Gowda). చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండే ఈ జంటకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. టీవీ సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైన ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు కానీ, స్నేహితులుగా పరిచయమై, ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా అమర్ దీప్ ‘జానకి కలగనలేదు’ సీరియల్ ద్వారా లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, తనని షో మొత్తం మానసికంగా ఎంత దెబ్బ కొట్టాలని చూసినా బెదరకుండా అద్భుతమైన ఆటని ప్రదర్శిస్తూ రన్నరప్ గా నిలిచాడు. చివరి వారం లో పల్లవి ప్రశాంత్ తో గొడవ జరగకపోయి ఉండుంటే కచ్చితంగా టైటిల్ కూడా గెలిచేవాడేమో.
Also Read : సౌత్ ఆడియన్స్ నాకు గుడి కట్టాలి అంటూ ఊర్వశి రౌతేలా కామెంట్స్!
ఇదంతా పక్కన రీసెంట్ గానే అమర్ దీప్, తేజస్విని జంటగా కలిసి స్టార్ మా ఛానల్ లో ప్రతీ వారం ప్రసారమయ్యే ‘ఇష్మార్ట్ జోడి 3’ లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. కచ్చితంగా టైటిల్ గెలుస్తారని అంతా అనుకున్నారు కానీ, అనూహ్యంగా టాప్ 4 లో నిలిచారు. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయని, వీళ్ళు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక ప్రచారం జోరుగా సాగింది. దీనిపై వీళ్లిద్దరు ‘ఇష్మార్ట్ జోడి 3’ షో లోనే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈమధ్య కాలంలో కొన్ని ఈవెంట్స్ కి తేజస్విని ఒక్కటే పాల్గొనడం, అమర్ దీప్ ఆమె పక్కన లేకపోవడం తో మళ్ళీ ఈ రూమర్స్ ప్రచారం అవ్వడం మొదలు పెట్టింది. రీసెంట్ గానే ఆమె జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ టాక్ షోలో పాల్గొంది.
ఈ టాక్ షోలో మరోసారి విడాకుల రూమర్స్ పై తేజస్విని స్పందించింది, ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ప్రచారం అయ్యేవి మొత్తం రూమర్స్. భార్యాభర్తలు అన్నాక కచ్చితంగా గొడవలు వస్తుంటాయి. గొడవలు లేని ఇల్లు ఎక్కడైనా ఉందా?, కానీ మేమిద్దరం ఒకరిని ఒకరు వదిలి ఉండలేము. అమర్ దీప్ నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు, నేను అయితే అతన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంటాను. మేము జీవితాంతం ఎప్పుడూ ఇలా కలిసే ఉంటాము’ అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని . ఆమె మాట్లడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే తేజస్విని ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్ లోనే ఆమె కంటెస్టెంట్ గా రావాల్సింది, కానీ తమిళం లో ఒక సీరియల్ చేస్తుండడం వల్ల రాలేకపోయింది. కానీ ఈ సీజన్ లో మాత్రం కచ్చితంగా పాల్గొనే అవకాశం ఉంది.
Also Read : బోయపాటి చిరంజీవి కాంబోలో సినిమా రాబోతోందా..? కథ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు…