Odela 2 Collections : ప్రముఖ హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2′(Odela 2) నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ ని చూసి కచ్చితంగా ఈ సినిమాలో మంచి విషయం ఉంది, ప్రేక్షకులకు మంచి హారర్ థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని అనుకున్నారు. అందుకే నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ రేట్స్ కి అమ్ముడుపోయాయి. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం అక్కడే రీకవర్ అయిపోయింది. ‘పొలిమేర’ సిరీస్ కి కథ ని అందించిన వ్యక్తే ఈ సినిమాకు కూడా కథని అందించడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. సినిమాలోని మొదటి 25 నిమిషాలు అదిరిపోవడం తో మిగిలిన సినిమా కూడా అలాగే ఉంటుందని ఆశించారు. కానీ స్క్రీన్ ప్లే బాగా రొటీన్ అయిపోవడంతో ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి మంచి టాక్ రాలేదు.
Also Read : రామ్ చరణ్ పెద్ది సినిమా క్లైమాక్స్ లో ఏం జరబోతుంది..?
ఫలితంగా ఈ చిత్రం ఓపెనింగ్స్ పై చాలా బలమైన ప్రభావం పడింది. మొదటి రోజు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి కేవలం పది వేల లోపే టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కేవలం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అందులో తెలుగు రాష్ట్రాల నుండి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ ఓవరాల్ గా 40 లక్షల రేంజ్ లో ఉండొచ్చు. సీక్వెల్ కావడంతో ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ 11 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. ఓవర్సీస్ లో బయ్యర్స్ లేకపోవడం తో నిర్మాతలు సొంతంగా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసుకున్నారు. అక్కడ కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసిన విషయం.
తమన్నా ఈ చిత్రం కోసం నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే ఈ సినిమాకు కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా క్లోజింగ్ లో వచ్చేలా లేవు. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో 11 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ కి ఇలాంటి వసూళ్లు వస్తాయని ట్రేడ్ అంచనా వేయలేకపోయింది. ఎందుకంటే హారర్ చిత్రాలకు మన ఆడియన్స్ నుండి కనీస స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి. కానీ ఏ చిత్రానికి ఎందుకు ఇలా జరిగిందో, డైరెక్టర్ సంపత్ నంది అదృష్టం ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఈమధ్య కాలం లో ఈయన సినిమాలు బాగుంటేనే థియేటర్స్ లో ఆడడం లేదు, ఇక ఈ రేంజ్ డివైడ్ టాక్ వస్తే ఎక్కడ ఆడుతుంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : కల్కి 2 మీద అంచనాలను పెంచుతున్న నాగ్ అశ్విన్…