Urvashi Rautela : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు ఊర్వశి రౌతేలా(Urvasi Rauthela). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి కేవలం ఐటెం సాంగ్స్ ద్వారానే పరిచయమైంది. హీరోయిన్ గా ఈమెకు టాలీవుడ్ లో ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం రాలేదు. కానీ హిందీ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో ఈమె ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో ది అవతార్’, ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాల్లో కనిపించింది. ఈ పాటలకు మన ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘డాకు మహారాజ్’ లోని ‘దబిడి దిబిడి’ సాంగ్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ పాట ప్రతీ చోట మనకు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఊర్వశి రౌతేలా ఒక్కోసారి ఇంటర్వ్యూస్ లో చాలా తలతిక్కగా మాట్లాడుతూ ఉంటుంది.
Also Read : బాబాయ్ తర్వాత అబ్బాయితో లక్కీ ఛాన్స్ కొట్టేసిన దబిడి దిబిడి భామ.. ఈ సారి ఏ రేంజ్ లో ఉంటుందో
ఆమె మాట్లాడే ఆ మాటలు సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్ కి గురి అవ్వుతుంటాయి. రీసెంట్ గా ఆమె ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సౌత్ ఆడియన్స్ నాకు కచ్చితంగా గుడి కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నార్త్ ఇండియా లో బద్రీనాథ్ టెంపుల్ పక్కనే నా పేరు మీద ఒక టెంపుల్ ఉంటుంది. భక్తులందరూ బద్రీనాథ్ లో దర్శనమయ్యాక, నా టెంపుల్ లోకి వచ్చి మొక్కుకుంటారు. అంతే కాదు ఢిల్లీ లోని ఒక విశ్వ విద్యాలయంలో నా ఫొటోకు దండాలు వేసి పూజిస్తుంటారు. అక్కడ నన్ను అందరు దండమమాయి అని పిలుస్తారు. నేను ఈ విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. నేను చెప్పేది నిజం, మీరు కూడా వెళ్లి చూడొచ్చు. సౌత్ లో నేను పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి సినిమాలు చేశాను. అక్కడ కూడా నాకు అభిమానులు ఉన్నారు. వాళ్ళని కూడా నాకు టెంపుల్ కొట్టాలని కోరుకుంటున్నాను. దేవత అయ్యి అందరినీ ఆశీర్వదిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతేలా.
ఇది ఆమె ఫన్నీ గా మాట్లాడింది అనుకుంటే చాలా పెద్ద పొరపాటు, సీరియస్ గానే చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈమెకు కచ్చితంగా పిచ్చి పట్టింది, ఈమెతో నటించే నటీనటులు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఈమె మాట్లాడిన వీడియో ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఊర్వశి మాట్లాడడం కొత్తేమి కాదు, గతంలో సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు దాడి చేస్తే, నా దగ్గర కూడా విలువైన వస్తువులు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని పోతారేమో, సెలబ్రిటీలకు రక్షణ లేకుండా పోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా నేను నటించిన చిత్రం తెలుగులో పెద్ద హిట్ అయ్యింది, కియారా అద్వానీ నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది అంటూ అప్పట్లో మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
Also Read : ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?
సౌత్ ఇండియాలో నా అభిమానులు నాకు ఒక గుడి కట్టాలని కోరుతున్నా
నార్త్ ఇండియాలో బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఊర్వశి టెంపుల్ అని నాకు ఒక గుడి కట్టారు – నటి ఊర్వశి రౌటేలా pic.twitter.com/vy2B3SUWRV
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2025