Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సినీ నిర్మాతలకు అసలు అందుబాటులోకి రావడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ‘ఓజీ'(They Call Him OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం 95 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కేవలం 5 రోజుల డేట్స్ ఇస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. గత వారమే ఆయన డేట్స్ కేటాయించాలి. కానీ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలవ్వడంతో సింగపూర్ కి వెళ్లాల్సి వచ్చింది. రీసెంట్ గానే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. ఇక షూటింగ్ మొదలు పెడతాడని అనుకుంటే మళ్ళీ జ్వరం అంటుకుంది. దీంతో మళ్ళీ ఆయన షూటింగ్ కి డేట్స్ కేటాయించలేకపోయాడు. దీంతో మే9న ఈ చిత్రం విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు.
Also Raed : మొన్న కలెక్టర్ల రివ్యూ.. ఇప్పుడు క్యాబినెట్ భేటీ.. పవన్ ఎందుకలా?
అభిమానులు ఈ విషయం తెలుసుకొని తీవ్రమైన అసంతృప్తి లో ఉన్నారు. అయితే అలాంటి అభిమానుల కోసం ఇప్పుడు ఒక శుభ వార్త తో మీ ముందుకు వచ్చాము. అదేమిటంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలలోనే పూర్తి చేయాలనీ పవన్ కళ్యాణ్ బలంగా నిర్ణయించుకున్నాడట. వచ్చే వారం నుండి షూటింగ్ లో పాల్గొంటానని ఆయన నిర్మాతకు కబురు అందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వాయు వేగంతో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యాక, ఈ నెల చివర్లో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మే 16 లేదా మే 23న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ట్రైలర్ కట్, మేకింగ్ వీడియో ని కూడా రెడీ చేసి పెట్టారట. రాబోయే రోజుల్లో వరుసగా ఈ సినిమా గురించి అప్డేట్స్ రానున్నాయి.
అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఓజీ’ మూవీ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. జూన్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట కానీ, సెప్టెంబర్ లో విడుదల అవ్వడం కష్టమే. నెట్ ఫ్లిక్స్ సంస్థ తో కుదిరించుకున్న డీల్ ప్రకారం ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అవ్వాలి. కాబట్టి డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యం అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 న విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. ఇప్పటికే 80 శాతంకి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది .బ్యాలన్స్ పూర్తి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ 25 రోజుల డేట్స్ ఇవ్వాలి.
Also Read : పాన్ ఇండియన్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫిక్స్..షూటింగ్ ఎప్పుడంటే!