OTT Movies
OTT Movies : ఇటీవల కాలంలో మళయాల సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మలయాళం పరిశ్రమ వాళ్లు రకరకాల కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు హార్రర్ సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు రివేంజ్ థ్రిల్లర్ సినిమాలకు, మిస్టరీ స్టోరీలతో తెరకెక్కిన సినిమాలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాంటి సినిమాల కథలనే రాస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు బాగా క్లిక్ అవుతున్నాయి. తాజాగా రివెంజ్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో హల్ చల్ చేస్తుంది.
మలయాళ సినిమాలు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. చిన్న చిన్న కథలతో వచ్చిన సినిమాలు సైతం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇక ఓటిటిలోకి కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా నిర్వాహకులు స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. అలాంటి సినిమానే ది టీచర్.. ఈ మూవీ రెండేళ్ల క్రితం మలయాళం లో విడుదల అయింది. అమలా పాల్ లీడ్ రోల్లో నటించింది. ఆమె ఈ సినిమాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో నటించింది.. ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ బాగానే రాబట్టింది. రెండేళ్ల తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ప్రేక్షకుల కోసం తీసుకొచ్చింది.
ఈ మూవీ మొత్తం ఒక ఫిజికల్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఓ రోజు స్కూల్లో ఈవెంట్ తర్వాత హీరోయిన్ అమలాపాల్ ఇంటికి తిరిగి వస్తుంది. మరుసటి రోజు ఒంటి గాయాలు కావడం చూసుకుని షాక్ తింటుంది. అసలు అంతకుముందు రాత్రి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఓ స్టూడెంట్ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అక్కడ జరిగింది విని షాక్ అవుతుంది. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఎలా పోరాటం చేస్తుంది. కట్టుకున్న భర్త వెళ్లగొట్టినా.. తన అత్త ఇచ్చిన ధైర్యంతో తనకు అన్యాయం చేసిన వాళ్లపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుందనే స్టోరీ మీద తెరకెక్కించారు. ఈ స్టోరీలో అక్కడక్కడా తడబడిన కూడా ఓవరాల్ గా సినిమా అయితే ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా ఉంటుంది.
ఇక అమలా పాల్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. తన కాపురానికి గుర్తుగా పండంటి బిడ్డ పుట్టారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఆమె మరో సినిమాలను కూడా చేసేందుకు రెడీ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను తన పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Teacher revenge thriller movie about taking revenge on students on ott
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com