Girl child : కొందరు ఐఏఎస్ అధికారులు(IAS officer) మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. సమాజ సేవకు పునరంకితమవుతూ ఉంటారు. అలాంటి కోవలోకి వస్తారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Aadarsh Surabhi). ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అయిన.. కొంతకాలం క్రితమే వనపర్తి జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. వనపర్తి ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత ఏర్పడిన జిల్లా. వనపర్తి పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ అన్ని వర్గాల వారు ఉంటారు. అయితే పేదల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. దీనిని రూపుమాపడానికి వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో బాగానే తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడానికి తనవంతుగా బాధితను స్వీకరించారు.. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అందమైన పెయింటింగ్స్ వేశారు. అందులో బాలిక విద్య ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించేలా చేశారు.. హైదరాబాద్ నుంచి పేరొందిన త్రీడీ ఆర్టిస్టులను తీసుకొచ్చి గోడలపై పెయింటింగ్స్ వేయించారు. అందులో ఒక చిత్రం మాత్రం తెగ ఆకట్టుకుంటున్నది. అధి కాస్త సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది.
ఆ పిక్చర్లో ఏముందంటే
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల గోడపై కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో త్రీడీ ఆర్టిస్టులు ఒక అందమైన చిత్రాన్ని రూపొందించారు. ఒక బాలిక తను చదువుకొని.. జీవితంలో స్థిరపడి.. ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు.. తలపైన కిరీటం పెట్టుకున్నట్టు ఆ చిత్రంలో ఉంది..” మీరు మీ అమ్మాయిని కనుక చదివిస్తే.. ఆమెకు అచంచలమైన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. చివరికి ఆమె ఒక సింహాసనంలో కూర్చుని.. మహారాణి లాగా కిరీటం ధరిస్తుంది. అలా జరగాలి అనుకుంటే కచ్చితంగా ఆమెను మీరు చదివించాలి. ఆమె కలలకు రంగులు అద్దాలి. ఆమె ఊహలకు రెక్కల గుర్రాన్ని ఊతంగా ఇవ్వాలి. ఆమె ఆశలకు ప్రాణం పోయాలి. ఆమె ఆనందానికి జీవం ఇవ్వాలి. ఆమె సంతోషానికి భరోసా ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా ఆమె చదువుకోవాలి. చదువుతోనే భవిత. చదువుతూనే భవిష్యత్తు.. చదువుతోనే వెలుగు.. చదువుతూనే విద్వత్తు.. అని అర్థం వచ్చేలాగా ఆ చిత్రాన్ని రూపొందించారు. సహజంగా వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో అవి తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా పూర్తిస్థాయిలో తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా కావడంతో.. అధికారులు బాల్యవివాహాలను రూపుమాపడానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా బాలిక విద్యను.. బాలిక సాధికారతను వివరించే విధంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ త్రీడి చిత్రం చూపరులను ఆకట్టుకుంటున్నది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.
View this post on Instagram