Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ తో చరణ్ , చైత్ర వంటి వారిని ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. జనాల ఓట్లకు విలువ ఇవ్వకుండా, వీకెండ్ లో ఎలిమినేషన్ ని రద్దు చేసి , ఇలా కంటెస్టెంట్స్ ఓటింగ్ తో చరణ్ లాంటి టాలెంటెడ్ కంటెస్టెంట్ ని బయటకు పంపేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని, చరణ్ ని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొని రావాల్సిందే అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో చరణ్ , చైత్ర ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని , ప్రస్తుతం వాళ్లిద్దరూ వాళ్ళింటికి వెళ్లిపోయారు అని వీడియో కాల్ ద్వారా కంటెస్టెంట్స్ తో మాట్లాడుతాడు నాగార్జున.
అయితే కచ్చితంగా ఇంతటి అన్యాయమైన ఎలిమినేషన్ చెయ్యరు, ఎదో ఒక మెలిక ఉంటుంది అని భావించిన నెటిజెన్స్ కి నిరాశే మిగిలింది. అయితే ఈ వారం మొత్తం హౌస్ ని నడిపించేది జనాలే, ‘పవర్ ఆఫ్ పీపుల్’ కాన్సెప్ట్ క్రింద మీరే ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలవాలో నిర్ణయించింది అంటూ ఆదివారం రోజున నాగార్జున చెప్పడం, అదే విధంగా ఫిజికల్ , మెంటల్ టాస్కుల్లో, ఏ టాస్క్ మొదటి కెప్టెన్సీ కి వాడాలి అనేది కూడా ఆడియన్స్ చేతిలో పెట్టి గేమ్ ని ఆసక్తికరంగా మార్చారు. ఇప్పుడు ఎలిమినేట్ అయినటువంటి చరణ్ , చైత్ర లలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలో కూడా ఆడియన్స్ చేతుల్లోనే పెట్టాడు బిగ్ బాస్. నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చరణ్ , చైత్ర బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్ లో శ్రీజ , భరణి ఎలా అయితే రీ ఎంట్రీ ఇచ్చారో , అలా అన్నమాట.
వీళ్లిద్దరికీ జరిగిన ఆడియన్స్ ఓటింగ్ లో చరణ్ కి అత్యధిక ఓట్లు రావడం తో , అతన్ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచారు , చైత్ర ని తిరిగి వెనక్కి పంపించేశారు. ఇదంతా మనం నేటి ఎపిసోడ్ లో చూడొచ్చు. రోహిత్ కి చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం తో , రోహిత్ ఫ్యాన్స్ మొత్తం చరణ్ కి ఓట్లు వేయాలంటూ పెద్ద ఎత్తున నిన్న ప్రచారం చేశారు. వాళ్ళు కసిగా ఓట్లు వేయడం వల్ల , నేడు చరణ్ ని మనమంతా బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నాము. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఎలాంటి గేమ్ ఆడకుండా , చాలా నీరసంగా ఉన్న చరణ్, కనీసం ఈ రీ ఎంట్రీ లో అయినా చురుగ్గా ఉంటాడో లేదో చూడాలి.