Jyothika : సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువా. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ తెరకెక్కించాడు. సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో కంగువా తెరకెక్కించారు. రూ. 300-350 కోట్లు ఖర్చు చేశారని అంచనా. కంగువా వెయ్యి కోట్లు వసూలు చేయడం ఖాయమని నిర్మాతలు విడుదలకు ముందే విశ్వాసం ప్రకటించారు. దిశా పటాని, బాబీ డియోల్ వంటి బాలీవుడ్ నటులు కీలక రోల్స్ చేశారు. కంగువా మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపింది. తెలుగు, తమిళ భాషల్లో కంగువాకు ఆదరణ దక్కలేదు. ఇతర భాషల్లో కూడా ఆడియన్స్ పట్టించుకోలేదు.
కంగువా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 100 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. నిర్మాత జీఈ జ్ఞానవేల్ రాజా తీవ్రంగా నష్టపోయాడు. ;పట్టులేని స్క్రీన్ ప్లే, దేవిశ్రీ అందించిన మ్యూజిక్ విఫలం కావడం, బీజీఎమ్ లో లోపాలు కంగువా ఫలితాన్ని దెబ్బ తీశాయి. భారీ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్న సూర్య కోరిక నెరవేరలేదు. కాగా కంగువా ఫలితం మీద సూర్య సతీమణి జ్యోతిక అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె సౌత్ చిత్రాలపై ఒకింత అభ్యంతర కామెంట్స్ చేసింది.
Also Read : సూర్యను వదిలేసి జ్యోతిక ముంబై వెళ్లిపోయిందా.? అసలేంటి కారణం..?
జ్యోతిక మాట్లాడుతూ… దక్షిణాదిలో తెరకెక్కిన కొన్ని చెత్త చిత్రాలు కూడా కమర్షియల్ గా ఆడాయి. వాటితో పోల్చుకుంటే కంగువా మెరుగైన చిత్రం. సినిమా ఆరంభంలో కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే బీజీఎమ్ లో లోపాలు ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు. కానీ కంగువా సినిమా తెరకెక్కించడానికి టీమ్ చాలా కష్టపడ్డారు. కంగువా మీద దారుణమైన రివ్యూలు రాశారు. మీడియా దారుణంగా వ్యవహరించింది… అన్నారు. కంగువా మంచి చిత్రమే. కానీ రివ్యూలు దెబ్బ తీశాయని చెప్పే క్రమంలో కమర్షియల్ గా సక్సెస్ అయిన చిత్రాలను ఆమె చెత్త సినిమాలు అనడం చర్చకు దారి తీసింది.
కాగా జ్యోతిక-సూర్య ముంబైకి షిఫ్ట్ అయ్యారు. సూర్య తమిళ చిత్రాలు చేస్తున్నప్పటికీ ముంబైలోనే ఉంటున్నారు. ఈ మధ్య తరచుగా సౌత్ పరిశ్రమ మీద జ్యోతిక విమర్శలు చేస్తుంది. ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జ్యోతిక నార్త్ అమ్మాయే కావడం విశేషం. నగ్మాకు జ్యోతిక కజిన్.
Also Read : ఆ స్టార్ హీరో చాలా రోమాంటిక్.. ఆ యాంగిల్ ను బయటపెట్టిన హీరోయిన్