Rajinikanth legacy: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజినీకాంత్(Rajinikanth)… ఏ సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమ స్వశక్తి తో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. రజనీకాంత్ కెరియర్ మొదట్లో బస్ కండక్టర్ గా జాబ్ చేసుకుంటూ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని సినిమాల్లో ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆయన స్టైల్ తో ప్రేక్షకులందరిని మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే కే బాలచందర్ (కి Bala Chandar) డైరెక్షన్లో వచ్చిన ‘అపూర్వ రాకంగల్'(Apoorva Ragangal) సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ సినిమా 1975 ఆగస్టు15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 2025 ఆగస్టు 15 వ తేదీకి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆగస్టు14వ తేదీన కూలీ (Cooli) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రజినీకాంత్ తన యాభై సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraj) సైతం రజినీకాంత్ 50 సంవత్సరాల సినీ కెరియర్ లో అతనికి కూలీ సినిమాతో ఒక గొప్ప సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ‘వార్ 2’ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశం చూస్తే ‘మొత్తం పోతారట!
రజినీకాంత్ కెరియర్ మొదట్లో విలన్ పాత్రలను పోషించినప్పటికి ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా వరుస సక్సెస్ లను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశాడు…ఇక తన కెరియర్ లో భాషా, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో, జైలర్ లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు..
70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా స్టార్ హీరోగా రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ముఖ్యంగా ఈ ఏజ్ లో ఏ హీరోకి పెద్దగా మార్కెట్ అయితే ఉండదు. కానీ రజనీకాంత్ మాత్రం ఈ ఏజ్ లో కూడా భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడనే చెప్పాలి…
Also Read: నితిన్ తో వాళ్ల నాన్న ఎందుకు సినిమాలు చేయడం లేదు… అసలు కారణం ఇదేనా..?
బాలీవుడ్ ఇండస్ట్రీకి అమితాబచ్చన్ ఎలాగో, సౌత్ సినిమా ఇండస్ట్రీకి రజనీకాంత్ కూడా అంతటి గొప్ప క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆయన తమిళతో పాటు తెలుగులో కూడా విశేషమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. రోబో (Robo) సినిమాతో సౌత్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…ఇక ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికి వాటిని తట్టుకొని నిలబడి సూపర్ స్టార్ గా ఎదిగాడు… ఇప్పుడున్న యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు…