Nithin family banner:తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడంలో చాలా వరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ మంచి సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతుంటే నితిన్ లాంటి యంగ్ హీరో మాత్రం ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. 2019 వ సంవత్సరంలో వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో వచ్చిన భీష్మ (Bhishma) సినిమాతో సక్సెస్ ని అందుకున్న నితిన్ అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు. దాదాపు 6 సంవత్సరాల్లో ఆరు ఫ్లాప్ సినిమాలను అందించి ప్రేక్షకులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తున్నాడు…ఇక నితిన్ తో తన తండ్రి సుధాకర్ రెడ్డి సినిమాలను నిర్మించడం లేదు. దానికి కారణం ఏంటి అంటూ కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. కెరియర్ మొదట్లో నితిన్ తో వరుసగా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు మాత్రం చేయడం లేదు…ఇష్క్(Ishq), గుండెజారి గల్లంతయిందే (Gundejari Gallanthayyinde) లాంటి సినిమాలతో నితిన్ కి మంచి సక్సెస్ లను అందించిన ఆయన ఇప్పుడు మాత్రం తన సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
Also Read: కన్నప్ప’ విషయంలో అక్షయ్ కుమార్ ఇంత మోసం చేశాడా..? వెలుగులోకి వచ్చిన నిజాలు!
దానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో కొంతమంది విమర్శకులు సైతం కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నితిన్ కి మార్కెట్ లేదనే ఉద్దేశ్యంతోనే వాళ్ళ నాన్న అతని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇతర బిజినెస్ ల మీద ఆయన ఫోకస్ చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
తోటి హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో నితిన్ మాత్రం ఇంకా అర కొర సక్సెస్ లను సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఆయన కెరియర్ ఇలా ఉంటే ఆయన ఇండస్ట్రీ ని షేక్ చేసే సక్సెస్ లను ఎప్పుడు సాధిస్తాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటి ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాడు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాల స్పీడ్ పెంచడం వెనక అసలు కారణం ఇదేనా..?
స్టార్ హీరోలతో పోటీ పడే స్థాయికి ఎప్పుడు ఎదుగుతాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…ఇక తన ఫ్యాన్స్ సైతం నితిన్ కి ఒక మంచి సక్సెస్ పడితే చూడాలని ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు నితిన్ 13 ఫ్లాపుల తర్వాత ఇష్క్(Ishq) సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అరడజన్ ప్లాప్ లను అందుకున్న నితిన్ మరోసారి కంబ్యాక్ ఇవ్వాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మరి ఇప్పుడు ఎలాంటి సినిమాని చేసి సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…