War 2 NTR intro scene:సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాల కొరత ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో పెద్ద హీరోల సినిమాలు తీర్చనున్నాయి. మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్ 2′(War 2 Movie), అదే విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలైన నెల రోజుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం రాబోతుంది. ఇలా ఈ ఏడాది సెకండ్ హాఫ్ మొత్తం స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ అయిపోయింది. అయితే ‘వార్ 2’ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read: బాలయ్య ఆ ఒక్క సినిమా చేసి ఉంటే రికార్డులు తిరగరాసేవాడా..?
గతంలో ఈయన ‘దేవర’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయనే ‘వార్ 2’ ని కూడా విడుదల చేయబోతున్నాడు. స్వతహాగా ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన నాగవంశీ ఆయన ప్రతీ సినిమాని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ నెల 31న నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన ‘కింగ్డమ్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ప్రొమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన ‘వార్ 2’ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ అభిమానులు ఆ మాటలను విని పూనకలొచ్చి ఊగిపోతున్నారు. ఇది కదా మనకి కావాల్సిన ఎమోషన్ అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇంతకు ఆయన మాట్లాడిన మాటలేంటో ఒకసారి చూద్దాం.
Also Read: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు చేసిన తప్పేంటి..?
నాగవంశీ మాట్లాడుతూ ‘వార్ 2 లో ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ సన్నివేశం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సినిమాలో ఎన్టీఆర్ అన్న, హృతిక్ రోషన్ కొట్టుకుంటారు. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ విసురుకుంటారు. ఇండియా లోనే ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ మధ్య ఫైటింగ్ జరిగితే స్క్రీన్స్ ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. కేవలం ఆ సన్నివేశాల కోసమే థియేటర్స్ కి కదిలే ప్రేక్షకులు కూడా ఉంటారు. జనాల్లో ఉన్న ఆ ఆసక్తిని చూసే నేను ఈ సినిమాని కొనుగోలు చేసాను. ఏ నిర్మాత అయినా కొనే ముందు నీలాంటివే చూస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ. వచ్చే వారం లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. రీసెంట్ గానే ఈ ఇద్దరి హీరోల మీద ఒక భారీ సాంగ్ ని షూట్ చేశారు. ఆ సాంగ్ కి సంబంధించిన షాట్స్ కూడా ట్రైలర్ లో ఉంటాయట.
“#War2 లో తారక్ అన్న Introduction Scene కి Screen చిరిగిపొద్ది.”
Full Interview: https://t.co/9XIFm9LatY pic.twitter.com/cynv8JvlyA
— Gulte (@GulteOfficial) July 15, 2025