పవన్ కళ్యాన్ ను తెరమీద కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వస్తాయి. కాస్త కథ ఉంటే చాలు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. అలాంటి పవన్ గురించి.. పవన్ సినిమాలపై స్టార్ రైటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు కథ రాయడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. ‘అలీతో సరదాగా’ షోలో రాజమౌళి గురించి.. ఇతర హీరోలు, సినిమా అనుభవాల గురించి పంచుకున్న విజయేంద్రప్రసాద్ తాజాగా పవన్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
పవన్ కళ్యాన్ తో సినిమా చేయడానికి కథ అవసరం లేదని.. ఆయన పాత సినిమాల్లోని నాలుగైదు సీన్లను కలిపి కొట్టినా ప్రేక్షకులు ఆదరించి హిట్ చేస్తారని విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ఉన్న స్టార్ డం.. అభిమానుల ఫాలోయింగ్ వల్ల పవన్ కు అసలు కథే అవసరం లేదన్నారు. ఆయనపై నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు ఉంటే చాలని కీలక వ్యాఖ్యలు చేశాఅరు. పాత మూవీలోని సీన్లు అటూ ఇటూ మార్చి తీసినా చూస్తారని తెలిపారు.
పవన్ సినిమా చూడ్డానికి వచ్చే వాళ్లకు కథ అక్కర్లేదని పవన్ పాటలు పాడాలి.. అమ్మాయిలతో సరదాగా ఆడుకోవాలి. విన్లకు ఇరగ్గొట్టాలి.. ఇవి ఉంటే చాలు.. కథ అక్కర్లేదు’ అని విజయేంద్రప్రసాద్ మాట్లాడారు. అయితే ఇది పాజిటివ్ కోణంలోనే చెప్పడం విశేషం.