
ఓ చిన్నారి చేసిన పని మెగాస్టార్ చిరంజీవిని కదిలించింది. ఆ చిన్నారి తనలో మరిత స్ఫూర్తి రగిలించిందని స్వయంగా చిరంజీవి ఒక వీడియో పోస్ట్ చేశారు. కరోనా సోకి ఆక్సిజన్ లేక ఎదురు చూస్తున్న వారి కోసం చీరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. కాగా అన్షి అనే చిన్నారి జూన్ 1న తన పుట్టినరోజు సందర్భంగా దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.