ఆయనతో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి – సుమలత

‘సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త’కు తన భ‌ర్త అంబ‌రీష్ పదే పదే గుర్తుకు వస్తున్నారట. భర్త జ్ఞాప‌కాల్లో సుమలత ప్రస్తుతం త‌డిసి ముద్ద‌వుతుంది. తెలుగింటి ఆడ‌బిడ్డైన సుమ‌ల‌త హీరోయిన్ గా ఎంతో క్రేజ్ ను తెచ్చుకుని క‌న్న‌డ స్టార్ హీరో అంబ‌రీష్‌ను 1991లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. సుమలత – అంబరీష్ ప్రేమకి ప్రతిఫలంగా ఒక కుమారుడు పుట్టాడు వీరికి. నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న ఈ సీనియర్ జంట పై ఆ దేవుడికి […]

Written By: admin, Updated On : June 1, 2021 8:06 pm
Follow us on

‘సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త’కు తన భ‌ర్త అంబ‌రీష్ పదే పదే గుర్తుకు వస్తున్నారట. భర్త జ్ఞాప‌కాల్లో సుమలత ప్రస్తుతం త‌డిసి ముద్ద‌వుతుంది. తెలుగింటి ఆడ‌బిడ్డైన సుమ‌ల‌త హీరోయిన్ గా ఎంతో క్రేజ్ ను తెచ్చుకుని క‌న్న‌డ స్టార్ హీరో అంబ‌రీష్‌ను 1991లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. సుమలత – అంబరీష్ ప్రేమకి ప్రతిఫలంగా ఒక కుమారుడు పుట్టాడు వీరికి.

నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న ఈ సీనియర్ జంట పై ఆ దేవుడికి కూడా అసూయ కలిగింది అనుకుంటా. సుమలతను ఒంటరిని చేసి అంబ‌రీష్ ను ఈ లోకం నుండి తీసుకువెళ్ళిపోయాడు. అంబరీష్ చనిపోయిన దగ్గర నుండి ఒంటరి తనాన్ని భరించలేక పోతున్న సుమలత, భర్తతో గడిపిన మధుర క్షణాలను, భర్తతో క‌లిసి జీవించిన తీపి జ్ఞాప‌కాల‌నే తల్చుకుంటూ గడుపుతుంది.

అంబరీష్ అంటే తనకు ఓ భావోద్వేగం అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమ‌ల‌త చెప్పుకొచ్చింది. పైగా తన భర్త గురించి చెబుతూ.. నా భర్త పై ఉన్న ప్రేమ అనంతమైనది, ఒక అపూర్వమైన శక్తి మమ్మల్ని కలిపింది. ఆయనతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా హృదయం అంతా ఆయన చిరునవ్వే నిండిపోయి ఉంది.

ఆయనతో నా బంధం హృద‌య‌గ‌త‌మైనది అంటూ సుమలత త‌న హృద‌యంలో అంబ‌రీష్‌ పై ఎంత ప్రేమ ఉందో చెప్పుకుని ఎమోషనల్ అయింది. నిజంగానే సుమ‌ల‌త‌ – అంబ‌రీష్ మనుషులు వేరు అయినా, ఇద్ద‌రి మ‌న‌సులు ఒక‌టే అని వారి గురించి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అందుకే తన భర్త పేరుతో సుమలత, సేవా కార్యక్రమాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.