https://oktelugu.com/

Chiranjeevi-Pawan Kalyan: ఆ విషయం లో చిరంజీవి కి పవన్ కళ్యాణ్ కి మధ్య గొడవ పెట్టించిన స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

చిరంజీవి తర్వాత ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 16, 2024 / 02:42 PM IST
    Follow us on

    Chiranjeevi-Pawan Kalyan: తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి క్రేజ్ ముందు ఏ ఒక్క హీరో కూడా నిలబడలేరు అనే చెప్పాలి. ఎందుకంటే సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుకుంటూ వచ్చిన చిరంజీవి ప్రతి ఒక్క స్టేజ్ లో తనని తాను మార్చుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో గా ఎదిగాడు.

    ఇక చిరంజీవి అనుక్షణం స్టార్ హీరో అవ్వాలంటే, మనం ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ముందుకు సాగాడు. అందువల్లే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా మెగాస్టార్ గా కూడా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక ఇలాంటి చిరంజీవి స్థానాన్ని భర్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎవ్వరికీ కూడా చిరంజీవికి ఉన్న అన్ని క్వాలిటీస్ అయితే లేవు. కొందరు డాన్స్ లు బాగా వేస్తే, మరికొందరు యాక్టింగ్ బాగా చేస్తారు.

    అందువల్లే చిరంజీవి తర్వాత ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. అయితే 2009 వ సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యమనే పార్టీని పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి భారీ గా సపోర్ట్ చేశాడు. అయితే ఆ ఎలక్షన్లల్లో ఓడిపోయిన తర్వాత చిరంజీవి తన మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేక, ఆయన పార్టీని ఎక్కువకాలం నిలపలేక అప్పుడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశాడు.

    అలా పార్టీ ని విలీనం చేయడంతో కొద్దిరోజులపాటు పవన్ కళ్యాణ్ చిరంజీవితో మాట్లాడలేదు అనే విషయాల మీద అప్పట్లో మీడియా లో చాలా కథనాలు కూడా వచ్చాయి. అయితే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెనుక చిరంజీవి బావ మరిది అయిన అల్లు అరవింద్ ఉన్నాడనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి అల్లు అరవింద్ తో కూడా చాలా సంవత్సరాలు పాటు మాట్లాడలేదనే వార్తలైతే వస్తున్నాయి.

    ఇక మరికొందరైతే అల్లు అరవింద్ చేయడం వల్లే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ పెరిగిందంటు, కొంతమంది మెగా అభిమానులు ఇప్పటికీ కూడా అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆ విషయం మీద మాట్లాడుతూ ఉంటారు…