https://oktelugu.com/

Nagarjuna-Amala: నాగార్జున అమలకు మధ్య గొడవకి కారణం అయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో కొత్త తరహా క్యారెక్టర్ లని చేయడంలో కూడా నాగార్జున ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. లేడీస్ లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా కూడా నాగార్జున మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 16, 2024 / 03:12 PM IST
    Follow us on

    Nagarjuna-Amala: సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రొమాంటిక్ స్టార్ గా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అలాగే ఇండస్ట్రీలో కొత్త తరహా క్యారెక్టర్ లని చేయడంలో కూడా నాగార్జున ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. లేడీస్ లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా కూడా నాగార్జున మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

    ఇక నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున, టబు హీరో హీరోయిన్లగా నటించారు.ఈ సినిమాలో వాళ్ళిద్దరీ పైన కొన్ని రూమర్లైతే వచ్చాయి. వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అంటూ చాలా రకాల వార్తలు కూడా బయటికి రావడంతో ఆ కథనాలను విన్న అమల నాగార్జునతో నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి టబు ను తప్పించాలని తనతో గొడవ పెట్టినట్టుగా అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి.

    అయితే నాగార్జున మాత్రం మీడియా లో వచ్చేది, ఒరిజినల్ గా సెట్ లో జరిగేది వేరని నాగార్జున ఎంత క్లారిటీ ఇచ్చిన అమల వినకపోవడంతో, నాగార్జున డైరెక్టుగా టబు ను ఇంటికి తీసుకువచ్చి వాళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు అనే విషయమని టబు తో అమలకి ఎక్స్ ప్లెయిన్ చేయించాడు. దాంతో అప్పటినుంచి అమల నాగార్జున మీద మంచి నమ్మకంతో ఉంటుంది. అలాగే టబు కూడా అమలకి మంచి ఫ్రెండ్ గా మారడంతో, సందర్భం దొరికిన ప్రతిసారి వీళ్ళిద్దరూ ఫోన్లు కూడా చేసుకొని మాట్లాడుకునేవారట. ఇక మొత్తానికైతే నిన్నే పెళ్లాడుతా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో నాగార్జున టబు జోడి కి మంచి పేరు వచ్చింది. దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి.

    అయితే అమల కి ఉన్న అపోహాలన్నీ నాగార్జున పోగొట్టడంతో వీళ్ళ జోడి మీద ఎన్ని రూమర్లు వచ్చినా కూడా అమల వాటన్నింటిని కొట్టిపారేస్తూ వచ్చేది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు…అలాగే నాగార్జున ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా సినిమాలు చేయడం లో అమల సపోర్ట్ చాలా వరకు ఉందనే చెప్పాలి…