https://oktelugu.com/

Trivikram-Bandla Ganesh: త్రివిక్రమ్, బండ్ల గణేష్ మధ్య గొడవ కి కారణం ఏంటో తెలుసా..?

త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మనందరికీ తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : February 16, 2024 / 02:35 PM IST
    Follow us on

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనే కథ, మాటలు రాసుకొని హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా సీన్లను క్రియేట్ చేస్తూ, హీరోల స్టార్ డమ్ తగ్గకుండా, మాస్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సక్సెస్ లు కొట్టడంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. తన కెరియర్ లో ఒకటి, రెండు ఫ్లాప్ లను మినహాయిస్తే, ఇప్పటివరకు ఆయనకు పెద్దగా ప్లాప్ లైతే రాలేదు.

    ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా మినిమం గ్యారంటీగా సినిమాలు అవ్వడం తో, త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చేయాలంటే త్రివిక్రమ్ ముందు ఆ కథ విని ఓకే చేసిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక ఇలాంటి క్రమంలో బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ఆప్తుడనే చెప్పాలి. అంటే బండ్ల గణేష్ ని ప్రొడ్యూసర్ గా చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి వీళ్ళ మధ్య కూడా మంచి సన్నిహిత్యం ఉంది.

    అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తోనే ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య నున్న మంచి ఫ్రెండ్షిప్ వల్ల బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చాడు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏదైనా సినిమా ఈవెంట్ జరిగితే అందులో బండ్ల గణేష్ తన స్పీచ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే గత కొన్ని రోజులుగా పవన్ ఈవెంట్స్ కి బండ్ల గణేష్ హాజరవ్వడం లేదు.

    దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ మీడియాలో వస్తున్న కొన్ని కథనాల ప్రకారం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ని కొంచెం దూరం పెట్టమని చెప్పాడని, అందువల్లే ఆయన బండ్ల గణేష్ ను దూరం పెడితూ వస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ మేటర్ ని మనసులో పెట్టుకొని బండ్ల గణేష్ అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ పైన ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ వస్తున్నాడు అంటు మరికొంత మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…