Prabhas Love Letter: సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరియర్ చాలా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ మీద కనిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేది వాళ్లే కాబట్టి వాళ్లకి ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ అవుతోంది. తద్వారా మార్కెట్ కూడా భారీగా పెరుగుతొంది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. మొత్తానికైతే వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కెరియర్ ను కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది… ఇక హీరోయిన్ల కెరియర్ అలా కాదు పెద్దగా సక్సెస్ వచ్చిన కూడా ఒక భారీ ఫ్లాప్ పడిందంటే ఆ హీరోయిన్ ని ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. ఐరన్ లెగ్ గా ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు. ఇండస్ట్రీలో ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలికి అనే సామెతను అందరు ఫాలో అవుతారు. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యూనరేషన్ ను చార్జ్ చేస్తూ లైఫ్ లో సెటిలైపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు…ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన 50 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నప్పటికి ఇంకా పెళ్లి అయితే చేసుకోలేదు. కారణం ఏంటి అనే విషయం ఎవరికి తెలియదు. కానీ మొదటినుంచి కూడా ప్రభాస్ కి లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను పౌర్ణమి సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మొదట ఒక హీరోయిన్ ని తీసుకున్నారట.
ఆ హీరోయిన్ షూట్ నటిస్తున్నప్పుడే ప్రభాస్ కి లవ్ లెటర్ ఇచ్చింది. తనను లవ్ చేయమని కొంత వరకు ఇబ్బంది కూడా పెట్టిందట.ఆమెతో విసిగిపోయిన ప్రభాస్ ఆమె ను పక్కన పెట్టేయమని దర్శకుడు కి చెప్పారట. దాంతో డైరెక్టర్ ప్రభుదేవా ఆ హీరోయిన్ ని మార్చేశారు… ప్రభాస్ చాలా రిజర్వుడ్ గా ఉంటాడు.
ఆయన ఎవరితో ఎక్కువగా కలిసి పోరు అందుకోసమే ఆయనను ఆ హీరోయిన్ ప్రేమిస్తున్నానని ఇబ్బంది పెట్టడంతో తనని పక్కన పెట్టేసారట… ఇక ఆమె ప్లేస్ లోనే హీరోయిన్ ఛార్మిని తీసుకున్నట్టుగా అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి.ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరోను ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు.
అందుకే ఆ అమ్మాయి తనకు ప్రభాస్ అంటే ఇష్టమని తను నోటితో చెప్పలేక లవ్ లెటర్ రాదు ఇచ్చినట్టుగా అప్పట్లో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి… ఇక ప్రస్తుతం ఆ హీరోయిన్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. కాబట్టి ఆమె వివరాలను చెప్పకపోవడమే మంచిదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…