Star Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు భారీ సినిమాలను చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా చాలామంది స్టార్ హీరోలు కొన్ని సినిమాలను స్టార్ట్ చేసి వర్కౌట్ అవ్వకపోవడంతో వాటిని మధ్యలోనే వదిలేశారు. ఇంతకీ మన స్టార్ హీరోలు వదిలేసిన సినిమాలు ఏంటి? ఆ సినిమాలు ఎందువల్ల ఆగిపోయాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
చిరంజీవి (Chiranjeevi) హీరోగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో ‘వినాలని ఉంది’ అనే సినిమా స్టార్ట్ అయింది. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మకి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో అర్ధాంతరంగా మధ్యలోనే ఈ సినిమాను వదిలేసి ఆయన బాలీవుడ్ ఫైట్ ఎక్కాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వర్మ బిహేవియర్ నచ్చక ఆ సినిమాను మధ్యలోనే ఆపేశాడు.
Also Read : రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి సినిమా చేసి ఉంటే బాగుండేదా..?
సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘అబు’ (బాగ్దాద్ గజ దొంగ)అనే ఒక పాన్ వరల్డ్ సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అవుతుంది అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక ముస్లింలకు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలుసుకున్న ముస్లింలు ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసిన కూడా రిలీజ్ చేయడానికి మేము ఒప్పుకోము అంటూ వాళ్ళు ధర్నాలు చేయడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేశారు…
బాలయ్య బాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘విక్రమ సింహ భూపతి’ అనే సినిమా భారీ ఎత్తున ఓపెనింగ్ జరుపుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న తర్వాత ఓవర్ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని క్యాన్సల్ చేశారు… బాలయ్య బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీయాలనుకున్న ‘నర్తన శాల’ సినిమాను స్వీయ దర్శకత్వంలో చేయాలని స్టార్ట్ చేశాడు. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్నాక ద్రౌపదిగా నటించాల్సిన సౌందర్య మరణించడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేశారు… బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ‘హర హర మహాదేవ్’ అనే సినిమా స్టార్ట్ అయింది. అయితే స్క్రిప్టులో అంత దమ్ము లేదని తెలుసుకున్న బాలయ్య దాన్ని మధ్యలోనే ఆపేసాడు.
Also Read : అల్లు అర్జున్ పుట్టినరోజుని పట్టించుకోని టాలీవుడ్ సెలబ్రిటీలు..!
ఇక వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాధ’ అనే సినిమా స్టార్ట్ అయింది. కానీ స్క్రిప్ట్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించకపోవడంతో వెంకటేష్ మధ్యలోనే ఆపేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా స్టార్ట్ అయింది. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత స్క్రిప్ట్ లో క్వాలిటీ లేదని తెలుసుకున్న వెంకటేష్ ఆ సినిమాని మధ్యలోనే ఆపేశారు. ఇక ఆ తర్వాత కిషోర్ తిరుమల ఆ సినిమాని శర్వానంద్ తో చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ ను మూటగట్టుంది…పెద్ద వంశీ దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయాల్సింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి వెంకటేష్ ఇమేజ్ ను బట్టి ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు.
పవన్ కళ్యాణ్ హీరోగా ‘సత్యాగ్రహి’ సినిమా భారీ రేంజ్ లో స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తాడు అని అందరు అనుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది…చెప్పాలని ఉంది అనే సినిమాని సైతం పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను క్యాన్సిల్ చేశారు.
రామ్ చరణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో మెరుపు అనే సినిమా స్టార్ట్ అయింది. అప్పటికే ఆరెంజ్ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయింది. ఓవర్ బడ్జెట్ కారణంగా ‘మెరుపు’ సినిమా సైతం బడ్జెట్ ఫెల్యూయర్ గా మిగులుతుందనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆ సినిమాను మధ్యలోనే ఆపేశాడు.
సింహాద్రి సినిమాకి ముందు ఎన్టీఆర్ హీరోగా పవన్ శ్రీధర్ అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వం లో ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇక ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం తో ఆ దర్శకుడు క్లారిటీ లేకపోవడంతో అతన్ని మార్చి ‘కలిసుందాం రా’ ఫేమ్ ‘ఉదయ శంకర్’ ని తీసుకున్నారు. అతను కూడా అంత కన్వీనెంట్ గా లేకపోవడంతో ఆ ప్రాజెక్టును మధ్యలో క్యాన్సిల్ చేశారు.
ఇక ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో విభేదాలను పెట్టుకోవడంతో అప్పటికే స్టార్ట్ అయిన పది సినిమాలు అర్ధంతరంగా ఆగిపోయాయి.