Nithin : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని మార్కెట్ లో మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న నితిన్(Nithin) కి ఈమధ్య కాలంలో పాపం ఏది కలిసి రావడంలేదు. ఎంతో నమ్మిన స్క్రిప్ట్స్ వర్కౌట్ అవ్వడం లేదు. మరో పక్క అదృష్ట దేవత కూడా ఆయన దరిదాపుల్లోకి రావడం లేదు. ‘భీష్మ’ వంటి భారీ హిట్ తర్వాత నితిన్ నుండి విడుదలైన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా యావరేజ్ రేంజ్ లో ఉంది. అంత పెద్ద ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదు. కానీ ఈ సినిమా విడుదలైన రోజే ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం విడుదల అవ్వడం, ఆ సినిమాకు మొదటి నుండి అంచనాలు భారీ రేంజ్ లో ఉండడం, విడుదల తర్వాత అందరూ దానికే మొగ్గు చూపడంతో ‘రాబిన్ హుడ్’ ని ఎవ్వరూ పట్టించుకోలేదు.
Also Read : నితిన్ ‘తమ్ముడు’ మూవీ స్టోరీ ఇదేనా?..ఈసారి గురి తప్పేలా లేదుగా!
ఫలితంగా నితిన్ కి మొదటి రోజు రావాల్సిన వసూళ్లు, కనీసం క్లోజింగ్ లో కూడా రాలేదు. ఇది ఆయనకు చాలా పెద్ద అవమానం. వాస్తవానికి ఈ చిత్రాన్ని గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే సంస్థ నుండి తెరకెక్కిన ‘పుష్ప 2’ ఇంకా థియేటర్స్ లో నడుస్తూ ఉండడం, ఆంధ్ర ప్రదేశ్ బయ్యర్స్ కి ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన అవసరం ఉండడంతో ‘రాబిన్ హుడ్’ ని వాయిదా వేశారు. నితిన్ నిర్మాతలకు ఎంత చెప్పి చూసినా వాళ్ళు వినలేదు. చివరికి మార్చి 28 కి వాయిదా పడింది. అదే రోజున ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఆ మూవీ టీం ని కాస్త ముందుకు వెళ్లాలని నితిన్ కోరుకున్నాడు కానీ ఓటీటీ డీల్ కారణంగా ఆ రోజునే రావాల్సి వచ్చింది.
‘రాబిన్ హుడ్’ చిత్రం డిసెంబర్ 25 న విడుదల చేసి ఉండుంటే కచ్చితంగా యావరేజ్ రేంజ్ లో ఆడేది, కనీసం ఓపెనింగ్స్ అయినా డీసెంట్ రేంజ్ లో ఉండేది. పోనీ తదుపరి చిత్రం ‘తమ్ముడు’ తో గట్టిగా కొడుతాడు, ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొథ్దిగా ఉంటుంది అని నితిన్ ఫ్యాన్స్ అనుకున్నారు. రీసెంట్ గానే గ్రాండ్ లెవెల్ లో ఒక ప్రత్యేకమైన వీడియో ని కూడా ఏర్పాటు చేసి ఈ చిత్రాన్ని జులై 4 న విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. కానీ ఆ తేదీన ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం వస్తుంది. ఆ చిత్ర నిర్మాతలు కాస్త రిక్వెస్ట్ చేయగానే ముందు వెనుక చూడకుండా నితిన్ ఆ డేట్ ని త్యాగం చేసేసాడు. ఇలా ప్రతీసారి నితిన్ కే అన్యాయం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు సైతం జాలి చూపిస్తున్నారు.
Also Read : నితిన్ ‘తమ్ముడు’ విడుదల తేదీ వచ్చేసింది..ఇదే చివరి అవకాశం!