Homeఎంటర్టైన్మెంట్Rajamouli: ఈ ఇద్దరు దర్శకులకు ఒక భారీ సక్సెస్ వస్తే రాజమౌళి ని కూడా బీట్...

Rajamouli: ఈ ఇద్దరు దర్శకులకు ఒక భారీ సక్సెస్ వస్తే రాజమౌళి ని కూడా బీట్ చేస్తారా..?

Rajamouli: సక్సెస్ ఫుల్ దర్శకులకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రేక్షకుల్లో సైతం వాళ్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దాన్ని వాడుకోవాడానికి ఒక దర్శకుడు తను చేసే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు సైతం […]

Rajamouli: సక్సెస్ ఫుల్ దర్శకులకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రేక్షకుల్లో సైతం వాళ్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దాన్ని వాడుకోవాడానికి ఒక దర్శకుడు తను చేసే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు సైతం టాప్ రేంజ్ లోకి వెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. దసర సినిమాతో మాస్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ‘ప్యారడైజ్’ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ గా అవతరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక చిరంజీవితో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ప్యారడైజ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందో దాన్ని బట్టి చిరంజీవి సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తున్నాడు. కాబట్టి తనకు కనక ఒక భారీ సక్సెస్ పడితే మాత్రం రాజమౌళిని సైతం మర్చిపోయే రేంజ్ లో టాప్ డైరెక్టర్ గా ముందుకు సాగుతాడని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగ సైతం ప్రస్తుతం రాజమౌళికి పోటీని ఇస్తున్నాడు.

ఆయన చేసిన రెండు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే రాజమౌళిని మించిన దర్శకుడిగా తను అవతరిస్తాడని ప్రతి ఒక్కరు చెబుతున్నాడు విశేషం…

సందీప్ రెడ్డి వంగా ఎలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. ప్రభాస్ ని కొత్తగా చూపిస్తాడా? ప్రభాస్ లో మాస్ యాంగిల్ ని మరోసారి ఎలివేట్ చేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? అనేది తెలియాల్సి ఉంది. సందీప్ రెడ్డివంగ గత సినిమాల్లో ఉన్నట్టుగా ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయా? అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper