Sreeleela and Nidhhi Agerwal : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు అవుతుంది. చూసేందుకు ఎంతో అందమైన రూపం, అద్భుతంగా నటించగలదు, డ్యాన్స్ వేయగలదు, కానీ సినిమా అవకాశాలు మాత్రం తన తోటి హీరోయిన్స్ కంటే చాలా తక్కువ, అయినప్పటికీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు నిధి అగర్వాల్(Nidhi Agarwal). ఈమె నాగ చైతన్య హీరో గా నటించిన ‘సవ్యసాచి’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా, అవకాశాలు మాత్రం బాగానే సంపాదించింది. కానీ ఈమె తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీలీల సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. కానీ నిధి అగర్వాల్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. రీసెంట్ గా ఈ అంశంపై నెటిజెన్ వేసిన ఒక ట్వీట్ కి నిధి అగర్వాల్ ఇచ్చిన రిప్లై బాగా వైరల్ అయ్యింది.
Also Read : నెపోటిజం కారణంగా బాలీవుడ్ లో శ్రీలీలకు అవమానం..క్రేజీ మూవీ నుండి అవుట్!
ఒక అభిమాని నిధి అగర్వాల్ నటించిన సినిమాల్లోని పాటల షాట్స్ అన్నిటిని కలిపి ఒక వీడియో గా ఎడిట్ చేసి ‘ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే’ పాటని అటాచ్ చేసాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది, ఎవరో ఒక నెటిజెన్ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ‘ఏమి ప్రయోజనం.. సినిమా అవకాశాలు ఎవ్వరూ ఇవ్వవండం లేదు. ఈమె తర్వాత ఇండస్ట్రీ .లోకి వచ్చిన శ్రీలీల(Heroine Sree leela) ఏకంగా 20 సినిమాలు చేసింది. 2019 లో విడుదలైన ‘ఇష్మార్ట్ శంకర్’ తర్వాత ఈమె ఎన్ని సినిమాలు చేసింది?’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి నిధి అగర్వాల్ సమాధానం ఇస్తూ ‘ఇష్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నేను తమిళంలో మూడు సినిమాలు చేశాను. తెలుగు ల ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం చేశాను. హడావడిగా 20 సినిమాలు చేసేయాలి అని నాకు లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘కథ నా మనసుకి నచ్చితేనే సినిమాలను చేస్తున్నాను. ఒక్కోసారి నా నిర్ణయాలు తప్పు అవ్వొచ్చు, కానీ ఎన్ని సినిమాలు చేసినా మంచి సినిమాల్లోనే చేయాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను ఇదే ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నాను. అందుకే బ్రదర్, నా గురించి మీరు ఇంత బాధ పడాల్సిన అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. శ్రీలీల పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకపోయిన, పరోక్షంగా నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆమెని ఉద్దేశిస్తూనే కామెంట్ చేసినట్టు అయ్యింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో ‘హరి హర వీరమల్లు’, ‘రాజా సాబ్’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలోనే ఉన్నాయి కానీ, ఎప్పుడు విడుదల అవుతాయి అనేది మాత్రం కనీసం ఆ చిత్రాల దర్శక నిర్మాతలకు కూడా తెలీదు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నిధి అగర్వాల్ రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుంది.
Also Read : ఆ హీరోతో డేటింగ్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు : నిధి అగర్వాల్