LSG Vs CSK IPL 2025: మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ అంతకు ముందు కీలక ఆటగాడిగా ఉన్నప్పుడు.. అనేక మ్యాచ్లలో ఫినిషర్ పాత్ర పోషించేవాడు. తోటి ఆటగాళ్లు విఫలమైనప్పుడు.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు రెచ్చిపోతున్నప్పుడు ఫినిషర్ పాత్రలో మైదానంలోకి ప్రవేశించేవాడు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ.. ప్రత్యర్థి బౌలర్లను ఆధుని చూసి దెబ్బ కొడుతూ మొత్తానికి మ్యాచులు గెలిపించేవాడు. 2011లో శ్రీలంక జట్టుపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ధోని ఎలాంటి ఫినిషింగ్ పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కేవలం ఉదాహరణ మాత్రమే. అలాంటివి ధోని కీర్తి కిరీటంలో ఎన్నో ఉన్నాయి. అందువల్లే ధోనిని ఈ కాలపు గొప్ప ఫినిషర్ గా పేర్కొంటారు.
Also Read: ధోని మాస్టర్ మైండ్.. నికోలస్ పూరన్ అన్నీ మూసుకొని వెళ్ళాడు..
వయసు అనేది నెంబర్ మాత్రమే
కొంతమందికి వయసు పైబడుతుంటే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందుకు ధోని మినహాయింపు కాదు. అనారోగ్య సమస్యల్ని కూడా ధోని ధైర్యంగా ఎదుర్కొంటూ.. గొప్ప ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. సోమవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని చేసింది 26 పరుగులు మాత్రమే కావచ్చు. కానీ అవి జట్టు విజయానికి చోదక శక్తి లాగా పనిచేశాయి. మామూలుగా అయితే లక్నో మైదానంలో.. బంతులు ఇబ్బంది పెడుతున్న క్రమంలో అలా నిలబడటం మామూలు విషయం కాదు. పైగా ప్రత్యర్థి జట్టు సొంతమైదానంలో అలా ఆడాలంటే ఎంతో నేర్పు ఉండాలి. అన్నింటికీ మించి ఓట్లు ఉండాలి. అవన్నీ కూడా ధోని చేసి చూపించాడు. ఎదురుదాడి మాత్రమే కాదు.. సమయమనం ఉంటే విజయాలు వాటంతటవే దక్కుతాయని నిరూపించాడు. ధోని 26 పరుగులు చేసినప్పటికీ.. జట్టు విజయంలో అవి కీలకపాత్ర పోషించాయి కాబట్టి ఐపిఎల్ నిర్వాహకులుఅతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు. కాని దాని తిరస్కరించాడు. అంతేకాదు అద్భుతంగా బౌలింగ్ వేసిన నూర్ అహ్మద్ కు ఇవ్వాలంటూ కోరాడు. దీనిని బట్టి ధోని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా.. నాయకుడిగా మాత్రమే కాకుండా.. గొప్ప ఫినిషర్ గా ధోని పేరు గడించాడు. అదే అవతారాన్ని సోమవారం మరోసారి లక్నో వేదికగా చెన్నై ప్రేక్షకులకు రుచి చూపించాడు. దీంతో వారంతా ఎగిరి గంతులు వేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే ధోని నామస్మరణ చేస్తున్నారు.. చాలా రోజుల తర్వాత ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. చెన్నై జట్టు మేనేజ్మెంట్ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. కష్టకాలంలో చెన్నై జట్టు విజయానికి తన వంతుకుమించి సహకారం అందించిన మహేంద్రసింగ్ ధోనీకి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇక ధోని ఇలాంటి ఇన్నింగ్స్ చాలా ఆడాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: చెన్నై కి కొత్త ఊపిరి పోసిన ఆ ఒక్క ఓవర్…