Nidhi Agarwal
Nidhi Agarwal : టాలీవుడ్ లో అందం, డ్యాన్స్,నటన ఈ మూడు కాంబినేషన్ లో ఉండే హీరోయిన్లు దొరకడం చాలా కష్టం. అలాంటి రోజుల్లో కూడా నిధి అగర్వాల్(Nidhi Agarwal) లాంటి హీరోయిన్లు దొరుకుంటుంటారు. ఈమె అందానికి కుర్రాళ్ళు ఎలా మెంటలెక్కిపోతారో మనం సోషల్ మీడియా లో తరచూ చూస్తూనే ఉన్నాము. డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం లో ఈమె నుండి మనం చూసిన డ్యాన్స్ కేవలం ఒక్క శాతం మాత్రమే. ఈమెకు అన్ని రకాల డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలదు. అలాగే నటనలో కూడా రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది కొత్త హీరోయిన్స్ కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఈమెకు అదృష్టం కలిసి రాలేదు, పెద్ద రేంజ్ కి వెళ్లే స్థాయి ఉన్నప్పటికీ, ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. ఇది కాసేపు పక్కన పెడితే, రీసెంట్ గానే ఈమె ఒక ప్రముఖ పోడ్ క్యాస్ట్ లో పాల్గొన్నది.
Also Read : వైసీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ షో రూమ్ ని ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్!
ఈ పాడ్ క్యాస్ట్ లో ఆమె అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఈమెకు ఎదురైనా అనుభవాలను పంచుకోగా అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈమె తొలిచిత్రం ‘మున్నా మైఖేల్’. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సినిమాకి అగ్రిమెంట్ చేసే ముందు నిధి అగర్వాల్ కి ఒక వింత కండీషన్ పెట్టారట. ఆమె మాట్లాడుతూ ‘మేము టైగర్ ష్రాఫ్(Tiger Shroff) తో గతంలో ‘మున్నా మైఖేల్’ అనే చిత్రం చేశాను. ఈ సినిమాకి సంతకం చేసే ముందు కండిషన్స్ అన్ని చదివాను. అందులో ముఖ్యమైన కండీషన్ ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు హీరో తో ప్రేమలో పడడం కానీ, డేటింగ్ చేయడం కానీ చేయకూడదట’ అంటూ చెప్పుకొచ్చింది.
‘హీరో హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకుంటే షూటింగ్ మీద ద్రుష్టి పెట్టలేరు అనే ఉద్దేశ్యంతోనే ఆ కండీషన్ ని పెట్టారట. నేను ఇప్పటి వరకు అన్ని ఇండస్ట్రీస్ లో పని చేశాను కానీ, అగ్రీమెంట్స్ లో ఇలాంటి షరతులు ఉండడం మాత్రం ఎప్పుడూ చూడలేదు’ అంటూ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ప్రభాస్(Rebel Star Prabhas) తో ‘రాజా సాబ్'(Raaja Saab) వంటి చిత్రాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలపై నిధి అగర్వాల్ కోటి ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు సూపర్ హిట్ అయితే పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి రీచ్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా ఈ రెండు చిత్రాల్లోనూ ఆమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే దొరికాయట.
Also Read : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ నిధి అగర్వాల్..ఈసారి ఏకంగా ఆ హీరోతో..అదృష్టం మాములుగా లేదుగా!