LSG Vs CSK IPL 2025: చెన్నై జట్టు ప్రస్తుత ఐపీఎల్ లో చుక్కలు చూస్తోంది. వరుస ఓటములతో తన ప్రభను కోల్పోతుంది. లక్న జట్టుతో సోమవారం జరుగుతున్న మ్యాచ్లో విజయం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. ఆ జట్టు ప్రస్తుత ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డులు నమోదు చేసింది. బహుశా ఈ రికార్డును గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా ఏ జట్టు కూడా నమోదు చేయలేదు. అంతటి పంజాబ్ జట్టు కూడా ఇలాంటి గణాంకాలు నమోదు చేయలేదు. ఇది ఒక రకంగా చెన్నై జట్టుకు ఇబ్బందికరమైన వార్త. జట్టులో సమూల మార్పులు చేపట్టాలని చెప్పే వార్త. ఇంతకీ ఆ గణాంకాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే..
Also Read: చెన్నై కి కొత్త ఊపిరి పోసిన ఆ ఒక్క ఓవర్…
అత్యంత చెత్త రికార్డులు
మిగతా ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా చెన్నై జట్టులో ఓపెనర్లు మెరుగ్గా ఆడతారనే పేరు ఉండేది. కానీ ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు పంజాబ్, లక్నో జట్లపై మినహా.. మిగతా అన్ని మ్యాచ్ల లోనూ విఫలమయ్యారు.. డేవిడ్ కాన్వే, రచిన్ రవీంద్ర దారుణంగా విఫలమవుతున్నారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో తొలి వికెట్ కు 11 పరుగులు జోడించారు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 బంతుల్లో 8 పరుగులు జోడించారు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని.. ఒక్క పరుగు కూడా నమోదు చేయకుండానే తొలి వికెట్ ను ప్రత్యర్థ బౌలర్ కు అప్పగించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేశారు.. పంజాబ్ జట్టుకు జరిగిన మ్యాచ్లో 61 పరుగులు చేశారు.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 16 పరుగులు.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో పరుగులు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు తొలి వికెట్ కు 162 పరుగులు చేశారు. అయితే యావరేజ్ 23.14 గా మాత్రమే ఉంది. ఇక రన్ రేట్ 8.10 గా సాగుతోంది. వాస్తవానికి ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత రెండవ అత్యల్ప రన్ రేట్. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ 7.26 రన్ రేట్ తో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
మొదటి మూడు ఓవర్లలో
ఐపీఎల్ లో మొదటి మూడో ఓవర్లలో చెన్నై జట్టు సాధించిన పరుగులను చూస్తే.. ముంబై ఇండియన్స్ పై ఒక వికెట్ కోల్పోయి 24 ఫార్వోలు చేసింది. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 13 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ కోల్పోయి ఐదు పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మ్యాచ్లో రెండు వికెట్ల కోల్పోయి 20 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ జట్టు మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 20 పరుగులు చేసింది..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కోల్పోకుండా 16 పరుగులు చేసింది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 37 పరుగులు చేసింది… అయితే ఇంతవరకు ఈ సీజన్లో ఆడిన ఐపీఎల్ మ్యాచ్ లలో లక్నో జట్టు పైన చెన్నై ఆటగాళ్లు కాస్త మెరుగైన ప్రదర్శన చేయడం విశేషం.
Also Read:ఎన్నో రోజులకు ఫినిషర్ ధోనీ మళ్ళీ మెరిశాడు… ఇదే కంటిన్యూ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే!