Sreeleela Birthday Celebration: గత పది రోజుల నుండి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ గ్యాప్ లేకుండా జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. వీళ్లిద్దరి పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఆ తర్వాత అమరావతి లో షూటింగ్ జరగనుంది. ఇలా విరామం లేకుండా కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారట మేకర్స్. సెప్టెంబర్ చివరి వారం లోపు సినిమాని రెడీ చేసి ఆ తర్వాత చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేస్తారట. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ నెల 14 న శ్రీలీల(SreeLeela) తన 24 వ పుట్టినరోజు ని జరుపుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేసారు నెటిజెన్స్. ఆమె పుట్టినరోజు నాడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ సెట్స్ లోనే ఉంది. ఆమె పుట్టినరోజు అనే విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా కేక్ తెప్పించి కట్ చేయించాడట. ఇది తనకు ఎంతో స్పెషల్ మూమెంట్ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ లుక్స్ ఈ ఫోటో లో చాలా బాగున్నాయని అభిమానులు అంటున్నారు. మూవీ టీం తో పాటు శ్రీలీల తల్లి కూడా ఈ ఫొటోలో ఉన్నది. పవన్ కళ్యాణ్ సాధారణంగా తన పని తాను చేసుకొని వెళ్లిపోయే మనిషి. ఇతర ఆర్టిస్టులతో చాలా మితంగా మాట్లాడుతాడు.
Also Read: Sreeleela and Nidhhi Agerwal : శ్రీలీల లాగా అవ్వాలని అనుకోవడం లేదు అంటూ నిధి అగర్వాల్ కామెంట్స్!
అలాంటిది శ్రీలీలకు ప్రత్యేకంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయించాడంటే కచ్చితంగా ఆమె చేస్తున్న చారిటీలు, సేవ కార్యక్రమాలు, పిల్ల పట్ల ఆమె చూపించే ప్రేమ వంటివి పవన్ కళ్యాణ్ వరకు చేరి ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో పాటు ,బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న శ్రీలీల కు ఈ చిత్రం ద్వారా సూపర్ హిట్ దక్కబోతుందో లేదో చూడాలి. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు ముందు శృతి హాసన్ వరుస ఫ్లాప్స్ లో ఉండేది, ఆమెని అందరు ఐరన్ లెగ్ అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా చేసిందో అప్పటి నుండి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. శ్రీలీల తలరాత కూడా ఆ విధంగా మారబోతుందా లేదా అనేది చూడాలి.