Country Bans Tourists: ఏ ఖర్చు లేకుండా.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదాయం వచ్చే ఏకైక మార్గం టూరిజం మాత్రమే. అందువల్లే టూరిజం అభివృద్ధికి అనేక దేశాలు ప్రాధాన్యమిస్తుంటాయి. పర్యటకులు తమ దేశానికి భారీగా రావాలని కోరుకుంటాయి.
యూరప్ లోని స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతం పర్యాటకంగా పేరొందింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల జాబితాలో స్పెయిన్ ముందు వరుసలో ఉంటుంది. ఇక బార్సిలోనాను అయితే పర్యాటకులు విపరీతంగా సందర్శిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాతావరణం బాగుంటుంది. నీటి వనరులు స్వచ్ఛంగా ఉంటాయి. విలాసవంతమైన హోటల్స్.. అధునాతనమైన బోటింగ్.. అత్యద్భుతమైన ప్రకృతి అక్కడ కనుల విందు చేస్తూ ఉంటుంది. ఇక రాత్రిపూట అక్కడ జరిగే వేడుకలు సరికొత్త ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా అక్కడి వంటకాలు పర్యాటకుల నోటికి అద్భుతమైన రుచిని అందిస్తుంటాయి. అందువల్లే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బార్సిలోనా నగర జనాభా 1.5 మిలియన్ అయితే.. ఆ ప్రాంతాన్ని గత ఏడాది ఏకంగా 15.5 మిలియన్ ప్రజలు సందర్శించారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే అక్కడి స్థానికులు కూడా ఓవర్ లోడ్ టూరిజం వల్ల ఇబ్బంది పడుతూ.. ఏకంగా ఆందోళనలకు దిగారు.
Also Read: Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై కాల్పులు.. మరో దారుణం
అసలు కారణం ఇది
బార్సి లోనా ప్రాంతంలో గతంలో అద్దెకు ఇళ్లు దొరికేవి. హోటల్స్ లో కూడా ఫుడ్ సరసమైన ధరలకు లభించేది. స్థానికంగా ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా పెద్దగా ఖర్చు ఉండేది కాదు. ఎప్పుడైతే టూరిస్టులు పెరిగారో అక్కడ ప్రతిదీ కూడా అత్యంత ఖరీదుగా మారిపోయింది. చివరికి తాగే వాటర్ బాటిల్ ఖరీదు కూడా గతం కంటే ఎక్కువయింది. ఇక హోటల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెంటెడ్ హోమ్స్ కూడా లభించడం లేదు. దీంతో టూరిస్టులు రావడం అక్కడి ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. అందువల్లేవారు తమ దేశానికి టూరిస్టులు రావద్దని.. తమన ఇబ్బంది పెట్టద్దని ఆందోళనకు దిగుతున్నారు. ప్ల కార్డులు చేతిలో పట్టుకుని నిరసనలు చేపడుతున్నారు. టూరిస్టు రావడం వల్ల జీవన వ్యయం పెరుగుతున్నదని.. ఇప్పటివరకు దీనిని భరించామని.. ఇకపై భరించే ప్రసక్తి లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు..” గతంలో మా ప్రాంతంలో అన్ని అత్యంత తక్కువ ధరకు లభించేవి. మాకు స్వేచ్ఛాయుత జీవితం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కూడా పెరిగిపోయాయి. ధరలు మేము ఊహించని స్థాయిలో ఎక్కువయ్యాయి. ఇలాంటి జీవన విధానం మాకు వద్దు. ఇదంతా జరగడానికి ప్రధాన కారణం టూరిస్టులు మాత్రమే. వారు మా దేశానికి రావద్దు. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వారు ఆనందంగా ఉండొద్దు. మా దేశ పరిపాలకులకు కూడా మేము ఇదే సూచిస్తున్నాం. పరిస్థితుల్లో మా జీవితాన్ని ప్రశ్నార్థకం చేయవద్దని కోరుతున్నామని” బార్సిలోనా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.