Sree Vishnu Mrityunjay Movie Review: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు శ్రీ విష్ణు(Sree Vishnu). ఈమధ్య కాలం లో ఆయన హీరో గా నటిస్తున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంటున్నాయి. శ్రీ విష్ణు విలక్షణమైన నటుడు అయినప్పటికీ, ఆయనలోని కామెడీ టైమింగ్ ని జనాలు విపరీతంగా నచ్చడం తో , ఈమధ్య కాలంలో వరుసగా ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను మాత్రమే ఎక్కువగా చేస్తూ వచ్చాడు. రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ దిశగా బాక్స్ ఆఫీస్ వైపు దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన వారం రోజులకు , అనగా మార్చి 6 న ఆయన హీరో గా నటించిన మరో చిత్రం ‘మృత్యుంజయ్’ విడుదల కాబోతుంది.
Also Read: తెలంగాణ రాష్ట్ర ఖజానా ‘నిల్’నా?
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లను ఇప్పటికే మీరంతా చూసే ఉంటారు. ఇన్ని రోజులు కామెడీ యాంగిల్ లో చూసిన శ్రీవిష్ణు ని ఒక్కసారిగా ఇలా సీరియస్ రోల్ లో చూసేసరికి కాస్త కొత్తగా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి (UA 16+) సర్టిఫికేట్ ని జారీ చేసింది. అంటే 16 సంవత్సరాలకు పైబడిన వారు మాత్రమే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడగలరు. ఇదంతా పక్కన పెడితే సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చెప్పిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమా కథ విషయానికి వస్తే తన ప్రాణ స్నేహితుడు మరణించడం తో , అతని కూతురి బాధ్యతలను మొత్తం హీరో నే చూసుకుంటాడు.
అయితే తన స్నేహితుడి మరణం అనుమానాస్పదంగా ఉండడం తో, అందుకు కారణాలను అన్వేషించడం కోసం క్రైం బ్యూరో లో ఉద్యోగం సంపాదించడం కోసం శ్రీవిష్ణు చాలా ప్రయత్నాలు చేస్తాడు . కానీ అధికారులు రిజెక్ట్ చేస్తారు. మరి తన స్నేహితుడి మర్డర్ మిస్టరీ ని శ్రీ విష్ణు ఎలా ఛేదించాడు? , క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట . సినిమాలో ఎక్కడ కూడా ఒక్క క్షణం బోర్ లేకుండా, చాలా నీట్ గా తెరకెక్కించాడట డైరెక్టర్. ఏ సన్నివేశం కూడా సాగదీసినట్టు లేదట. సినిమా నిడివి కూడా కేవలం 2 గంటల 2 నిమిషాలు మాత్రమేనట. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఈమధ్య కాలంలో ఏ సినిమాలో కూడా రాలేదని అంటున్నారు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ వర్కౌట్ అయితే ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.