Sonakshi Sinha: సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన హీరామండీ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సోనాక్షి సిన్హా ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు జహీర్ ఇక్బాల్ సోనాక్షి సిన్హా చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్నారు అనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
అయితే వీళ్ళు రహస్యంగా పెళ్లి చేసుకుంటారా లేదా పెద్దల ఇష్టం తో పెళ్ళి చేసుకుంటారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే ఈ విషయం మీద సోనాక్షి సిన్హా స్పందిస్తూ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది తన వ్యక్తిగత విషయమని ఎవరో డిసైడ్ చేస్తే నేను అది చేయలేనని చెప్పింది. ఇక గత సంవత్సరం నుంచి జహీర్ ఇక్బాల్ సోనాక్షి సిన్హా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక వీటిని బేస్ చేసుకొని చాలా మంది వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అనే వార్తలను అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్ 2019 వ సంవత్సరంలో నోట్ బుక్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
Also Read: Kalki 2898 AD: కల్కి కి దీపికా పదుకొనె ప్లస్సా? మైనస్సా? తేడా కొడితే అంతే!
ఇక అప్పటినుంచి ఆయన మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నాడు. మొదట సినిమా ఇండస్ట్రీతో ఏ సంబంధం లేని జహీర్ కి సల్మాన్ ఖాన్ తో మాత్రం ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. ఇక వీళ్ళ ప్రేమ మీద సోనాక్షి సిన్హా తండ్రి అయిన శత్రజ్ఞా సిన్హా రీసెంట్ గా మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి మమ్మల్ని పిలిస్తే నేను నా భార్య వెళ్లి ఆశీర్వదిస్తాం లేదంటే పెళ్లి కి వెళ్లలేము అంటూ తను నవ్వుతు తన సమాధానాన్ని చెప్పాడు. ఇక తను మాట్లాడుతూ ఈరోజుల్లో పెళ్లి విషయం లో ఎవరూ కూడా పెద్దలకు అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ల పెళ్లిళ్లు వాళ్లే చేసుకుంటున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు.
Also Read: Noor Malabika Das: ది ట్రయల్ నటి మరణం.. మృతదేహం కోసం కూడా రాని తల్లిదండ్రులు
ఇక అలాగే జహీర్ ఇక్బాల్ ముస్లిం కాబట్టి సోషల్ మీడియాలో కొంతమంది లవ్ జిహాద్ పేరిట మోసం జరుగుతుంది అంటూ పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు వాళ్లకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. దాంట్లో మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ తను మాట్లాడాడు. ఇక వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన గత కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడటం సంచలనాన్ని సృష్టించింది…