Rajinikanth songs copyright issue CSK: ఈ నెల 28 వ తారీఖు నుండి IPL టోర్నమెంట్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న సందర్భంగా, క్రికెట్ అభిమానులు ఇప్పటి నుండే సోషల్ మీడియా లో తమ అభిమాన జట్టులపై ట్వీట్స్ వేస్తూ పూర్తి స్థాయిలో యాక్టీవ్ అయ్యారు. ఫ్యాన్ వార్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యం లో పలు IPL టీమ్స్ వివాదాల్లో కూడా చిక్కుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టీం లోకి పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ ప్రవేశించడాన్ని తప్పు బాదుతూ, రీసెంట్ గానే నెటిజెన్స్ #BoycottSRH అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. ఈ వివాదం ఒక పక్క కొనసాగుతుండగా, మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ టీం పై సన్ టీవీ నెట్వర్క్ కోటి రూపాయిల కాపీ రైట్స్ స్ట్రైక్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ , జైలర్ 2 , కూలీ చిత్రాలను సన్ నెట్వర్క్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ సినిమాలు ఏ రేంజ్ కి వెళ్లాయి అనేది కాసేపు పక్కన పెడితే , ఈ చిత్ర్లల్లోని మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఈ మ్యూజిక్ ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) తమ ప్రమోషనల్ వీడియోస్ కి అనుమతి లేకుండా వాడుకుంటుందని , కాపీ రైట్స్ ని ఉల్లంగించినందున వారి పై చర్యలు తీసుకోవాలని, కోటి రూపాయిల జరిమానా చెల్లించాలంటూ మద్రాసు హై కోవర్టు లో పిటీషన్ వేయగా, దానికి CSK టీం మ్యానేజ్మెంట్ స్పందిస్తూ, ఆ మ్యూజిక్ ని మా వీడియోస్ నుండి తొలగించామని చెప్పుకొచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ హై కోర్టు వెల్లడించింది.
Also Read: కప్పులే కాదు.. అవార్డులూ కొల్లగొడుతున్న భారత క్రికెటర్లు.. అబ్బాయిలే కాదు అమ్మాయిలూ ఇందులో ఉన్నారు!
ఇకపోతే సన్ నెట్వర్క్స్ అధినేత కూతురు కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టీం కి యజమాని అనే సంగతి మన అందరికీ తెలిసిందే. IPL పోటీలో ఉన్నందున , కావాలని ఉద్దేశపూర్వకంగానే కేసు ని నమోదు చేసారని, సాధారణంగా ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, CSK ని ఇరుకున పెట్టడం కోసమే సన్ నెట్వర్క్స్ యాజమాన్యం ఇలా చేసిందని అంటున్నారు. సాధారణంగా ఎలివేషన్ సన్నివేశాల కోసం ఈమధ్య కాలం లో జైలర్ , కూలీ చిత్రాలకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అభిమానులు అయితే విచ్చలవిడిగా వాడేస్తుంటారు. వాళ్ళెవ్వరి మీద ఇది వరకు కేసులు వెయ్యలేదు కానీ , CSK మీద మాత్రం పగబట్టి కేసులు వేయడం అన్యాయమని, శత్రు దేశానికీ చెందిన బౌలర్ ని తమ టీం లోకి తీసుకోవడమే కాకుండా, ఇలా తోటి జట్టుపై కేసులు వేయడం వెనుక వారి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదని అంటున్నారు నెటిజెన్స్.
