spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj abusive posts case: యాంకర్ అనసూయ పై అసభ్యకరమైన పోస్టులు.. అరెస్ట్ చేసిన...

Anasuya Bharadwaj abusive posts case: యాంకర్ అనసూయ పై అసభ్యకరమైన పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

Anasuya Bharadwaj abusive posts case: సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో కొంతమంది ఆకతాయిలు , కొందరు సెలబ్రిటీస్ ని టార్గెట్ గా చేసుకొని పెడుతున్న అసభ్యకరమైన కామెంట్స్ కి సదరు సెలబ్రిటీలు ఎంత బాదపడ్డారో అనేక సందర్భాల్లో మనం చూసాము. కొంతమంది సెలబ్రిటీలు పట్టించుకోరు కానీ, మరికొంతమంది మాత్రం వీళ్ళు పెట్టే అసభ్యకరమైన పోస్టులు , కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అలాంటి సెలబ్రిటీస్ లో ఒకరు అనసూయ(Anchor anasuya). సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈమె , సమాజం లో జరిగే కొన్ని సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తన గొంతుని వినిపిస్తూ ఉంటుంది. వాటిపై నెటిజెన్స్ కొంతమంది ఏకీభవించి మద్దతుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొందరు అయితే హద్దులు దాటి, వినలేని పదాలతో అడ్డమైన బూతులు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు.

అలాంటి వారిపై అనసూయ రీసెంట్ గానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. వారిలో జనార్దన్ అనే అతన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేయారు. కడప కు చెందిన ఈ వ్యక్తి , గత కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఇతను అనసూయ పై AI వీడియో క్రియేట్ చేసి, చాలా అసభ్యకరంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఇది చూసిన అనసూయ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఇతనిపై కేసు నమోదైంది. కేసులు ఇప్పటికే చాలా మందిపై నమోదు అయ్యింది , కానీ పోలీసులు పనిగట్టుకొని అరెస్ట్ చేయడానికి రారులే అనే ధీమా తో దర్జా గా హైదరాబాద్ లోనే ఉన్న జనార్దన్ కి, పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇస్తూ, ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కేవలం ఇతన్ని మాత్రమే కాదు , ఒక ప్రముఖ సినీ నటి చేసిన రీల్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఒక ఆటో డ్రైవర్ ని కూడా పోలీసులు రీసెంట్ గానే అరెస్ట్ చేశారు.

Also Read: దేవి శ్రీ ప్రసాద్ ఇక హరీష్ శంకర్ తో సినిమాలు చేయడా..? కారణమేంటంటే..?

దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోరుంది కదా అని, మొబైల్ లో డేటా ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అరెస్ట్ అవ్వక తప్పదు. కాబట్టి ఆకతాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోరు ని అదుపులో పెట్టుకోండి. అంతే కాదు ఈమధ్య కాలం లో స్టార్ హీరోల అభిమానుల ఫ్యాన్ వార్స్ కూడా హద్దులు దాటుతున్నాయి. వీరిపైనా కూడా కేసులు నమోదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళక తప్పదు. సోషల్ మీడియా ని ఉపయోగకరంగా మార్చుకోవాలి కానీ, జీవితాలను పాడు చేసుకునేవిధంగా మాత్రం వాడుకోకూడదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version