https://oktelugu.com/

Kalki 2898 AD: కల్కి కి దీపికా పదుకొనె ప్లస్సా? మైనస్సా? తేడా కొడితే అంతే!

ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న మరో అంశం దీపికా పదుకొనె. గ్లోబల్ ఫేమ్ ఉన్న దీపికా పదుకొనె కల్కి చిత్రానికి చాలా ప్లస్ అవుతుందని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను తీసుకున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 12, 2024 / 10:49 AM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: కల్కి 2829 AD మూవీ విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ తారాగణంతో కల్కి తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ భైరవ రోల్ చేస్తుండగా అమితాబ్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇక దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూన్ 10న కల్కి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ రేంజ్ మూవీ అంటున్నారు.

    అదే సమయంలో కొన్ని మైనస్ లు వెతుకుతున్నారు. కాగా ప్రభాస్ గత చిత్రాల ట్రైలర్స్ దరిదాపుల్లో కూడా కల్కి ట్రైలర్ లేకపోవడం ఊహించని పరిణామం. సలార్ ట్రైలర్ కి 24 గంటల్లో 113 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కల్కి కేవలం అన్ని భాషల్లో కలిపి 34 మిలియన్ వ్యూస్ మాత్రమే అందుకుంది. ఆదిపురుష్, రాధే శ్యామ్ వంటి ప్రభాస్ డిజాస్టర్ మూవీస్ ట్రైలర్స్ కి కూడా కల్కికి మించిన రెస్పాన్స్ దక్కింది.

    ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న మరో అంశం దీపికా పదుకొనె. గ్లోబల్ ఫేమ్ ఉన్న దీపికా పదుకొనె కల్కి చిత్రానికి చాలా ప్లస్ అవుతుందని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను తీసుకున్నారు. అయితే మొదటి నుండి ఆమెతో యూనిట్ కి సమస్యలే అని సమాచారం. షూటింగ్ సమయంలో ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనే వాదన ఉంది. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా ఆమె స్పృహతప్పి పడిపోయారని చిత్ర యూనిట్ ఒప్పుకున్నారు.

    ఇక ట్రైలర్ లో దీపిక డైలాగ్స్ ట్రోల్స్ కి దారి తీశాయి. దీపికా పదుకొనె తెలుగు డబ్బింగ్ దారుణంగా ఉంది. అలాంటప్పుడు ఆమెతో తెలుగు డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం ఏమిటనే సందేహం కలుగుతుంది. దీపికా వలన మరొక మైనస్ ఏమిటంటే మాస్ ఆడియన్స్ కి దీపికా పదుకొనె అంటే పెద్దగా అవగాహన ఉండదు. ప్రభాస్ ఫ్యాన్స్ లో మెజారిటీ మాస్ ఉంటారు. ఆమెకు తెలుగులో పెద్దగా ఫేమ్ లేదు. ఆమె గొప్ప నటి అయినప్పటికీ ఈ పరిణామాలు కల్కి పై ప్రతికూల ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. అయితే అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదు…